ప్రభన్యూస్

Iran Updates: ‘ఇక తగ్గేదే లేదు.. హద్దుల్లేకుండా విరుచుకుపడండి’.. శత్రువులపై తక్షణ దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ఆదేశాలు! |


Last Updated:

అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా ఏ ప్రాంతం అనే పరిమితి లేకుండా తక్షణమే తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ సైన్యానికి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

News18
News18

ఇరాన్ సైనిక దళాలకు ఆ దేశ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అత్యంత కీలకమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. శత్రు దేశాల నుంచి ఎలాంటి చిన్న ముప్పు ఎదురైనా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే విరుచుకుపడాలని సైన్యానికి స్పష్టం చేశారు. ఈ ప్రతీకార దాడులు చేసేందుకు ఎటువంటి భౌగోళిక సరిహద్దుల ఆంక్షలు లేవని, శత్రువుల స్థావరాలు ఎక్కడ ఉన్నా టార్గెట్ చేయాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి సైనిక కమాండర్లతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన అన్ని రకాల ఆస్తులను తమ దాడి పరిధిలోకి తీసుకురావాలని మిలిటరీని ఆదేశించారు. యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలో ఇరాన్ ప్రజలు, సాయుధ బలగాలు మాత్రమే నిర్ణయిస్తాయని ఆయన తేల్చిచెప్పారు.

ముదురుతున్న యుద్ధ మేఘాలు..

పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా నెలకొన్న ఘర్షణలు మరో ప్రమాదకర స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ ఆదేశాలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతర్జాతీయంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిలో అనుమతి లేని మార్గాల్లో వెళ్తున్న నాలుగు చమురు ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. మరో ముడి చమురు నౌకపై గుర్తుతెలియని ప్రక్షేపకం దాడి చేసిందనే వార్తలు గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెంచాయి.

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రాకపోకలకు నిరంతరం అంతరాయం ఏర్పడుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టారు.

ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న సంకేతాల నడుమ ఖమేనీ పూర్తి స్థాయి పోరాటానికి పిలుపునిచ్చారు. నిఘా, రక్షణ రంగాల్లో స్వదేశీ ఆయుధాల తయారీని భారీగా పెంచాలని సైన్యానికి నిర్దేశించారు. ఖతార్ వంటి దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, తాజా హెచ్చరికలతో పశ్చిమాసియా మరో భీకర యుద్ధం దిశగా వెళ్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 6:35 pm Digital Edition : Prabhanews
Iran Updates: ‘ఇక తగ్గేదే లేదు.. హద్దుల్లేకుండా విరుచుకుపడండి’.. శత్రువులపై తక్షణ దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ఆదేశాలు! |

Last Updated:Oct 31, 2026 6:10 PM ISTఅమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా ఏ ప్రాంతం అనే పరిమితి లేకుండా తక్షణమే తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ సైన్యానికి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.News18ఇరాన్ సైనిక దళాలకు ఆ దేశ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అత్యంత కీలకమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. శత్రు దేశాల నుంచి ఎలాంటి చిన్న ముప్పు ఎదురైనా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే విరుచుకుపడాలని సైన్యానికి స్పష్టం చేశారు. ఈ ప్రతీకార దాడులు చేసేందుకు ఎటువంటి భౌగోళిక సరిహద్దుల ఆంక్షలు లేవని, శత్రువుల స్థావరాలు ఎక్కడ ఉన్నా టార్గెట్ చేయాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి సైనిక కమాండర్లతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన అన్ని రకాల ఆస్తులను తమ దాడి పరిధిలోకి తీసుకురావాలని మిలిటరీని ఆదేశించారు. యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలో ఇరాన్ ప్రజలు, సాయుధ బలగాలు మాత్రమే నిర్ణయిస్తాయని ఆయన తేల్చిచెప్పారు.ముదురుతున్న యుద్ధ మేఘాలు..పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా నెలకొన్న ఘర్షణలు మరో ప్రమాదకర స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ ఆదేశాలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతర్జాతీయంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిలో అనుమతి లేని మార్గాల్లో వెళ్తున్న నాలుగు చమురు ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. మరో ముడి చమురు నౌకపై గుర్తుతెలియని ప్రక్షేపకం దాడి చేసిందనే వార్తలు గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెంచాయి.ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రాకపోకలకు నిరంతరం అంతరాయం ఏర్పడుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టారు.ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న సంకేతాల నడుమ ఖమేనీ పూర్తి స్థాయి పోరాటానికి పిలుపునిచ్చారు. నిఘా, రక్షణ రంగాల్లో స్వదేశీ ఆయుధాల తయారీని భారీగా పెంచాలని సైన్యానికి నిర్దేశించారు. ఖతార్ వంటి దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, తాజా హెచ్చరికలతో పశ్చిమాసియా మరో భీకర యుద్ధం దిశగా వెళ్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.మరింత చదవండి

Source link