Reliance Retail: రిలయన్స్ రిటైల్ రెండో త్రైమాసికంలో రూ. 2,619 కోట్ల నికర లాభం | బిజినెస్


Last Updated:

Reliance Retail: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్, సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (Q2)లో నికర లాభంలో క్షీణతను నమోదు చేసింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ పన్ను అనంతర లాభం (PAT) వార్షిక ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి రూ. 2,619 కోట్లకు పరిమితమైనట్లు శుక్రవారం సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 3,469 కోట్లుగా నమోదైంది. ప్రధాన పండుగల సీజన్ మూడో త్రైమాసికం (డిసెంబరు క్వార్టర్) వైపు మారడమే లాభాలు తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.

స్థూల ఆదాయంలో 6.43 శాతం వృద్ధి

లాభం తగ్గినప్పటికీ, వ్యాపార ఆదాయంలో వృద్ధి కొనసాగింది. రిలయన్స్ రిటైల్ స్థూల ఆదాయం గత ఏడాది నమోదైన రూ. 86,169 కోట్ల నుంచి 6.43 శాతం పెరిగి రూ. 91,716 కోట్లకు చేరింది. ఇక రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 5.78 శాతం వృద్ధితో రూ. 80,220 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 75,836 కోట్లుగా ఉంది.

కార్యకలాపాల ఎబిట్డా (EBITDA) 11.1 శాతం తగ్గి రూ. 5,886 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 6,624 కోట్లు. వన్-టైమ్ ఇంపెయిర్‌మెంట్ ఛార్జీలకు ముందు ఎబిట్డా 8.6 శాతం క్షీణించి రూ. 6,228 కోట్లకు చేరింది. డిజిటల్ కామర్స్ విభాగంలో చేపట్టిన ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపకుండా సంస్థే భరించడం, పండుగల సీజన్ మూడో త్రైమాసికానికి మారడంతో మార్జిన్లపై 120 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడిందని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్తగా 303 స్టోర్ల ఏర్పాటు

ఈ త్రైమాసికంలో కంపెనీ తమ విక్రయ నెట్‌వర్క్‌లో కొత్తగా 303 స్టోర్లను ప్రారంభించింది. అయితే లాభదాయకంగా లేని స్టోర్ల మూసివేత అనంతరం నికరంగా 222 స్టోర్లు తగ్గాయి. సెప్టెంబరు 30 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 19,821 నుంచి స్వల్పంగా 0.6 శాతం పెరిగి 19,947కి చేరుకుంది. మొత్తం రిటైల్ విస్తీర్ణం మాత్రం స్వల్పంగా తగ్గి 77.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.

కస్టమర్ల నుంచి నిలకడైన డిమాండ్: ముఖేష్ అంబానీ

ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ.. “రిలయన్స్ రిటైల్ అన్ని ఫార్మాట్లు, ఛానళ్లలో నిలకడైన వృద్ధిని కొనసాగించింది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడంపై మేం దృష్టి సారించడంతో పాటు పటిష్టమైన భౌతిక స్టోర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉండటం వల్ల వినియోగదారుల డిమాండ్ బలంగా ఉంది. మా ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో క్రమంగా విస్తరిస్తూ కస్టమర్ల ఆదరణ పొందుతోంది. ప్రధాన పండుగలు మూడో త్రైమాసికానికి మారినప్పటికీ, ఈ క్వార్టర్‌లో లావాదేవీలలో 7 శాతం వృద్ధి నమోదు కావడం కస్టమర్లతో మాకున్న అనుబంధాన్ని తెలియజేస్తోంది” అని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 8:13 am Digital Edition : Prabhanews
Reliance Retail: రిలయన్స్ రిటైల్ రెండో త్రైమాసికంలో రూ. 2,619 కోట్ల నికర లాభం | బిజినెస్

Last Updated:Oct 31, 2026 7:55 AM ISTReliance Retail: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్, సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (Q2)లో నికర లాభంలో క్షీణతను నమోదు చేసింది.ఫైల్ ఫోటోసమీక్షా త్రైమాసికంలో కంపెనీ పన్ను అనంతర లాభం (PAT) వార్షిక ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి రూ. 2,619 కోట్లకు పరిమితమైనట్లు శుక్రవారం సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 3,469 కోట్లుగా నమోదైంది. ప్రధాన పండుగల సీజన్ మూడో త్రైమాసికం (డిసెంబరు క్వార్టర్) వైపు మారడమే లాభాలు తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.స్థూల ఆదాయంలో 6.43 శాతం వృద్ధిలాభం తగ్గినప్పటికీ, వ్యాపార ఆదాయంలో వృద్ధి కొనసాగింది. రిలయన్స్ రిటైల్ స్థూల ఆదాయం గత ఏడాది నమోదైన రూ. 86,169 కోట్ల నుంచి 6.43 శాతం పెరిగి రూ. 91,716 కోట్లకు చేరింది. ఇక రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 5.78 శాతం వృద్ధితో రూ. 80,220 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 75,836 కోట్లుగా ఉంది.కార్యకలాపాల ఎబిట్డా (EBITDA) 11.1 శాతం తగ్గి రూ. 5,886 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 6,624 కోట్లు. వన్-టైమ్ ఇంపెయిర్‌మెంట్ ఛార్జీలకు ముందు ఎబిట్డా 8.6 శాతం క్షీణించి రూ. 6,228 కోట్లకు చేరింది. డిజిటల్ కామర్స్ విభాగంలో చేపట్టిన ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపకుండా సంస్థే భరించడం, పండుగల సీజన్ మూడో త్రైమాసికానికి మారడంతో మార్జిన్లపై 120 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడిందని కంపెనీ స్పష్టం చేసింది.కొత్తగా 303 స్టోర్ల ఏర్పాటుఈ త్రైమాసికంలో కంపెనీ తమ విక్రయ నెట్‌వర్క్‌లో కొత్తగా 303 స్టోర్లను ప్రారంభించింది. అయితే లాభదాయకంగా లేని స్టోర్ల మూసివేత అనంతరం నికరంగా 222 స్టోర్లు తగ్గాయి. సెప్టెంబరు 30 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 19,821 నుంచి స్వల్పంగా 0.6 శాతం పెరిగి 19,947కి చేరుకుంది. మొత్తం రిటైల్ విస్తీర్ణం మాత్రం స్వల్పంగా తగ్గి 77.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.కస్టమర్ల నుంచి నిలకడైన డిమాండ్: ముఖేష్ అంబానీఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ.. "రిలయన్స్ రిటైల్ అన్ని ఫార్మాట్లు, ఛానళ్లలో నిలకడైన వృద్ధిని కొనసాగించింది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడంపై మేం దృష్టి సారించడంతో పాటు పటిష్టమైన భౌతిక స్టోర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉండటం వల్ల వినియోగదారుల డిమాండ్ బలంగా ఉంది. మా ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో క్రమంగా విస్తరిస్తూ కస్టమర్ల ఆదరణ పొందుతోంది. ప్రధాన పండుగలు మూడో త్రైమాసికానికి మారినప్పటికీ, ఈ క్వార్టర్‌లో లావాదేవీలలో 7 శాతం వృద్ధి నమోదు కావడం కస్టమర్లతో మాకున్న అనుబంధాన్ని తెలియజేస్తోంది" అని పేర్కొన్నారు.మరింత చదవండి

Source link