ప్రభన్యూస్

Religious Conversion: పరీక్షకు వెళ్లిన మైనర్ బాలికల కిడ్నాప్.. దర్గాలో ఉంచి బలవంతపు మతమార్పిడి కుట్ర! ఎక్కడంటే? |


Last Updated:

Religious Conversion: గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, మెహసానాలోని ఓ దర్గాలో బంధించి బలవంతంగా మతమార్పిడికి యత్నించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ వ్యవహారంలో ఒక మౌల్వీ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. కోడినార్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వి. హరియాణి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 24న కోడినార్ పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పరీక్ష రాసేందుకు వెళ్లి రాత్రి వరకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన ఒక బాలిక తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

సీసీటీవీ, మొబైల్ లొకేషన్‌తో గుట్టురట్టు

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, మొబైల్ నెట్‌వర్క్ లొకేషన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు, ఆ ఇద్దరు బాలికలు మెహసానా జిల్లాలోని ఉనావా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. ఉనావా స్థానిక పోలీసుల సమన్వయంతో కోడినార్ పోలీసులు అక్కడి ప్రసిద్ధ మీరా దాతార్ బాపూ దర్గాపై ఆకస్మిక దాడి నిర్వహించారు. అక్కడ ఇద్దరు మైనర్ బాలికలు బుర్కా ధరించి ఉండటాన్ని పోలీసులు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం మహిళా పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారిని తిరిగి సురక్షితంగా కోడినార్‌కు తీసుకొచ్చారు.

మతమార్పిడి, పెళ్లికి కుట్ర

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మైనర్ బాలికలను పెళ్లి చేసుకుని, మతం మార్చే ఉద్దేశంతోనే అక్కడికి తరలించినట్లు తేలింది. మూడు రోజుల పాటు వారిని దర్గాలోనే ఉంచి, వారి పేర్లు మార్చి, బలవంతంగా బుర్కా ధరింపజేసి కల్మా చదివించారు. అంతేకాకుండా, అందులో ఒక మైనర్ బాలికకు 18 ఏళ్ల షాకిర్ అలియాస్ ‘బబ్లీ’తో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. కోడినార్‌కు చెందిన నిందితుడు అబ్దుల్ హాజీ సంధి అనే వ్యక్తి సదరు బాలికలతో పరిచయం పెంచుకుని, వారిని ఉనావా దర్గాకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారించారు.

ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ

ఈ కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులలో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

అబ్దుల్ హాజీ సంధి (కోడినార్ నివాసి – బాలికలను తీసుకువెళ్లిన వ్యక్తి)

మౌల్వీ ఆసిఫ్ ఖవ్వాలి అలియాస్ ‘మరాఠీ’ (ఉనావా దర్గా మౌల్వీ)

షాకిర్ అలియాస్ ‘బబ్లీ’ (18 ఏళ్ల యువకుడు, ఉనావా నివాసి)

రాజ్‌కోట్ జిల్లా ధోరాజీకి చెందిన నాల్గవ నిందితుడు నాసిద్ ఖాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ ఎన్.వి. హరియాణి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 1:01 pm Digital Edition : Prabhanews
Religious Conversion: పరీక్షకు వెళ్లిన మైనర్ బాలికల కిడ్నాప్.. దర్గాలో ఉంచి బలవంతపు మతమార్పిడి కుట్ర! ఎక్కడంటే? |

Last Updated:Oct 30, 2026 12:53 PM ISTReligious Conversion: గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, మెహసానాలోని ఓ దర్గాలో బంధించి బలవంతంగా మతమార్పిడికి యత్నించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.ప్రతీకాత్మక చిత్రంఈ వ్యవహారంలో ఒక మౌల్వీ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. కోడినార్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వి. హరియాణి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 24న కోడినార్ పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పరీక్ష రాసేందుకు వెళ్లి రాత్రి వరకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన ఒక బాలిక తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.సీసీటీవీ, మొబైల్ లొకేషన్‌తో గుట్టురట్టుసీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, మొబైల్ నెట్‌వర్క్ లొకేషన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు, ఆ ఇద్దరు బాలికలు మెహసానా జిల్లాలోని ఉనావా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. ఉనావా స్థానిక పోలీసుల సమన్వయంతో కోడినార్ పోలీసులు అక్కడి ప్రసిద్ధ మీరా దాతార్ బాపూ దర్గాపై ఆకస్మిక దాడి నిర్వహించారు. అక్కడ ఇద్దరు మైనర్ బాలికలు బుర్కా ధరించి ఉండటాన్ని పోలీసులు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం మహిళా పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారిని తిరిగి సురక్షితంగా కోడినార్‌కు తీసుకొచ్చారు.మతమార్పిడి, పెళ్లికి కుట్రపోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మైనర్ బాలికలను పెళ్లి చేసుకుని, మతం మార్చే ఉద్దేశంతోనే అక్కడికి తరలించినట్లు తేలింది. మూడు రోజుల పాటు వారిని దర్గాలోనే ఉంచి, వారి పేర్లు మార్చి, బలవంతంగా బుర్కా ధరింపజేసి కల్మా చదివించారు. అంతేకాకుండా, అందులో ఒక మైనర్ బాలికకు 18 ఏళ్ల షాకిర్ అలియాస్ 'బబ్లీ'తో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. కోడినార్‌కు చెందిన నిందితుడు అబ్దుల్ హాజీ సంధి అనే వ్యక్తి సదరు బాలికలతో పరిచయం పెంచుకుని, వారిని ఉనావా దర్గాకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారించారు.ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీఈ కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులలో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.అబ్దుల్ హాజీ సంధి (కోడినార్ నివాసి - బాలికలను తీసుకువెళ్లిన వ్యక్తి)మౌల్వీ ఆసిఫ్ ఖవ్వాలి అలియాస్ 'మరాఠీ' (ఉనావా దర్గా మౌల్వీ)షాకిర్ అలియాస్ 'బబ్లీ' (18 ఏళ్ల యువకుడు, ఉనావా నివాసి)రాజ్‌కోట్ జిల్లా ధోరాజీకి చెందిన నాల్గవ నిందితుడు నాసిద్ ఖాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ ఎన్.వి. హరియాణి స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link