ప్రభన్యూస్

DESTINY: ట్రెండ్ అవుతున్న ‘డెస్టినీ’ ఇమ్మాన్యుయేల్ సాంగ్.. యూత్ అయితే ఫిదా అవుతున్నారు మావా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ లో రాబోతున్న సినిమా ‘డెస్టినీ’. ఈ సినిమా నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.

News18
News18

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా నందినీ రెడ్డి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని హిట్ మెషిన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. పాట చాలా బాగుందని, సినిమా కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇమాన్యుయేల్ చాలా క్లోజ్ అని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మారుతి రాజా అందించిన బాణీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్‌గా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఈ పాటకు శ్రీరామ్ తపస్వి సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల గాత్రం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ స్టెప్పులు ఎంతో సింపుల్‌గా, అందరూ రీల్స్‌తో ట్రెండ్ చేసేలా ఉన్నాయి. ఆయన కొరియోగ్రఫీతో ఈ పాట మరింత అందంగా మారింది.

విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ ట్రెండ్ కాగా, ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 1:03 pm Digital Edition : Prabhanews
DESTINY: ట్రెండ్ అవుతున్న ‘డెస్టినీ’ ఇమ్మాన్యుయేల్ సాంగ్.. యూత్ అయితే ఫిదా అవుతున్నారు మావా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 30, 2026 12:54 PM ISTజబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ లో రాబోతున్న సినిమా ‘డెస్టినీ’. ఈ సినిమా నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. News18కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా నందినీ రెడ్డి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని హిట్ మెషిన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. పాట చాలా బాగుందని, సినిమా కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇమాన్యుయేల్ చాలా క్లోజ్ అని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మారుతి రాజా అందించిన బాణీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్‌గా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఈ పాటకు శ్రీరామ్ తపస్వి సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల గాత్రం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ స్టెప్పులు ఎంతో సింపుల్‌గా, అందరూ రీల్స్‌తో ట్రెండ్ చేసేలా ఉన్నాయి. ఆయన కొరియోగ్రఫీతో ఈ పాట మరింత అందంగా మారింది.విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ ట్రెండ్ కాగా, ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరింత చదవండి

Source link