ప్రభన్యూస్

ఏరోనాటికల్ ఇంజినీర్‌ చదివి ‘కిల్లర్‌’తో సినీ నటుడిగా.. అసలు ఎవరీ దశరథ మాధవ్‌? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌ అంశాల కలయికతో రూపొందిన కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దశరథ మాధవ్‌. మరి అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

News18
News18

ఒక ఐఐటీ ర్యాంకర్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్.. ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతమైన జీవితం.. అవన్నీ తన కలల సాగు కోసం వదిలేశారు. ఫలితాన్నిస్తుందా.. ఇవ్వదా? అనే ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ మైండ్‌ సెట్‌తో కష్టపడే రైతులా కష్టపడ్డారు. చివరకు ఆ కష్టం ఫలించే రోజు వచ్చింది. అవమానాలను దిగ మింగి.. అందించిన చేతిని ఊతంగా చేసుకుని వెండితెరపైకి అడుగులు వేసిన ఆ వ్యక్తే దశరధ మాధవ్. ‘కిల్లర్’ సినిమాతో నటుడిగా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దశరధ.. 7వ తరగతిలో రిపబ్లిక్ డే వేడుకకు తమ స్కూలుకు వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కలిసి తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి దశరధ చెప్పారు. చదువుకుని సినీరంగంలోకి అడుగు పెట్టమని.. అప్పుడే సినీరంగంలో భవిష్యత్ ఉంటుందని ధర్మవరపు సలహా ఇచ్చారు. అది మనసులో బాగా నాటుకుపోయింది. అంతే.. పదోతరగతిలో డిస్ట్రింక్షన్‌లో పాసయ్యారు. ఇంటర్ కూడా టాప్ మార్కులతో పాసై.. ఐఐటీ ర్యాంక్ సాధించారు. ఆ తరువాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించారు. ఆ తరువాత మాస్టర్స్ చేసి ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్ సంపాదించారు. జాబ్ చేస్తూ డైలీ క్యాబ్‌లో వెళుతున్న తరుణంలో రేడియో మిర్చి వింటూ ఉండేవారు. అలా రేడియో మిర్చి – ఈటీవీ సౌజన్యంలో నిర్వహించిన వాయిస్ పాషన్ షో గురించి తెలుసుకున్నారు. దీనికి 50 వేల మందిని సెలక్ట్ చేస్తే 15 మంది ఫైనల్‌కు వెళ్లారు. దానిలో ఫస్ట్ వచ్చి టైటిల్ విన్నర్‌గా నిలిచారు. సుమ నిర్వహించిన ఈ జంక్షన్‌కి రావడం.. కామెడీ స్కిట్స్‌ రైటర్‌గానే కాకుండా.. స్కిట్స్‌లో చేశారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

సినీరంగంలో విజయం సాధించాలంటే తొలి అడుగు ఎంతో కీలకం. ఆ అడుగు ఎంత చిన్నదన్నది కాదు.. దాన్ని ఎంత నమ్మకంతో ముందుకు వేస్తామన్నదే ముఖ్యం. నేడు అగ్రస్థానంలో ఉన్న ఎందరో నటులు చిన్న చిన్న పాత్రలతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు. అదే స్ఫూర్తితో దశరథ మాధవ్‌ కూడా తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ‘కిల్లర్’ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తూ, తనలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసలు తన ప్రయాణం మొదలు పెట్టింది.. ‘ఎ మాస్టర్ పీస్, ప్రేరణ, బువ్వమ్మ కథలు, భామ సత్యభామ’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణం ప్రారంభించినా కూడా ‘కిల్లర్’ ముందుగా విడుదల అవుతోంది. దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటుడిగా కనిపించడమే కాకుండా, లైన్‌ ప్రొడ్యూసర్‌గా కూడా దశరథ బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. అంటే ఇది ఆయనకు కేవలం నటనలో తొలి అడుగు మాత్రమే కాదు.. సినిమా నిర్మాణ ప్రక్రియలోనూ తన అనుభవాన్ని చాటుకునే వేదిక. తన సినీ కలను సాకారం చేసుకునేందుకు ‘కిల్లర్‌’ను ఓ కీలకమైన అవకాశంగా మలుచుకుంటున్నారు.

కెరీర్‌లో ఎదగాలనే ఆశయం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్నవారి కష్టాలను గుర్తించి స్పందించే హృదయం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలోనూ దశరథ మాధవ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు రామచంద్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఆయన, ఆర్థిక సహాయం అందించి తన వంతు అండగా నిలిచారు. తోటి కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించడం, తనకు చేతనైన సహాయం చేయడం ఆయనలోని మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలవడం అభినందనీయం. పేరు, గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తించాలనే ఆలోచన ఆయన వ్యక్తిత్వానికి మరో కోణాన్ని పరిచయం చేస్తోంది.

ఒక నటుడు అవడమంటే చిన్న విషయం కాదు.. దీని వెనుక ఎంతో కష్టం… ఎన్నో అవమానాలుంటాయి. అలాగే అందించిన చేతులూ ఉంటాయి. అలా అవమానాలను దిగ మింగుకుని.. అందించిన చేతిని వదలకుండా తన లక్ష్యం వైపు దశరధ మాధవ్ అడుగులు వేశారు. దశరథ మాధవ్‌ ముందున్న లక్ష్యం స్పష్టం. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. నటుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలి. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రయాణంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలన్నదే ఆయన ఆశయం. ‘కిల్లర్‌’తో ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం ఆయనకు ఎలాంటి అనుభవాలను అందిస్తుంది? ప్రేక్షకుల ముందుకు నటుడిగా వస్తున్న దశరథ మాధవ్‌ తన నటనతో ఎంతవరకు ఆకట్టుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 11:45 pm Digital Edition : Prabhanews
ఏరోనాటికల్ ఇంజినీర్‌ చదివి ‘కిల్లర్‌’తో సినీ నటుడిగా.. అసలు ఎవరీ దశరథ మాధవ్‌? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 29, 2026 10:42 PM ISTసైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌ అంశాల కలయికతో రూపొందిన కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దశరథ మాధవ్‌. మరి అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? News18ఒక ఐఐటీ ర్యాంకర్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్.. ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతమైన జీవితం.. అవన్నీ తన కలల సాగు కోసం వదిలేశారు. ఫలితాన్నిస్తుందా.. ఇవ్వదా? అనే ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ మైండ్‌ సెట్‌తో కష్టపడే రైతులా కష్టపడ్డారు. చివరకు ఆ కష్టం ఫలించే రోజు వచ్చింది. అవమానాలను దిగ మింగి.. అందించిన చేతిని ఊతంగా చేసుకుని వెండితెరపైకి అడుగులు వేసిన ఆ వ్యక్తే దశరధ మాధవ్. ‘కిల్లర్’ సినిమాతో నటుడిగా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దశరధ.. 7వ తరగతిలో రిపబ్లిక్ డే వేడుకకు తమ స్కూలుకు వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కలిసి తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి దశరధ చెప్పారు. చదువుకుని సినీరంగంలోకి అడుగు పెట్టమని.. అప్పుడే సినీరంగంలో భవిష్యత్ ఉంటుందని ధర్మవరపు సలహా ఇచ్చారు. అది మనసులో బాగా నాటుకుపోయింది. అంతే.. పదోతరగతిలో డిస్ట్రింక్షన్‌లో పాసయ్యారు. ఇంటర్ కూడా టాప్ మార్కులతో పాసై.. ఐఐటీ ర్యాంక్ సాధించారు. ఆ తరువాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించారు. ఆ తరువాత మాస్టర్స్ చేసి ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్ సంపాదించారు. జాబ్ చేస్తూ డైలీ క్యాబ్‌లో వెళుతున్న తరుణంలో రేడియో మిర్చి వింటూ ఉండేవారు. అలా రేడియో మిర్చి - ఈటీవీ సౌజన్యంలో నిర్వహించిన వాయిస్ పాషన్ షో గురించి తెలుసుకున్నారు. దీనికి 50 వేల మందిని సెలక్ట్ చేస్తే 15 మంది ఫైనల్‌కు వెళ్లారు. దానిలో ఫస్ట్ వచ్చి టైటిల్ విన్నర్‌గా నిలిచారు. సుమ నిర్వహించిన ఈ జంక్షన్‌కి రావడం.. కామెడీ స్కిట్స్‌ రైటర్‌గానే కాకుండా.. స్కిట్స్‌లో చేశారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.సినీరంగంలో విజయం సాధించాలంటే తొలి అడుగు ఎంతో కీలకం. ఆ అడుగు ఎంత చిన్నదన్నది కాదు.. దాన్ని ఎంత నమ్మకంతో ముందుకు వేస్తామన్నదే ముఖ్యం. నేడు అగ్రస్థానంలో ఉన్న ఎందరో నటులు చిన్న చిన్న పాత్రలతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు. అదే స్ఫూర్తితో దశరథ మాధవ్‌ కూడా తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ‘కిల్లర్’ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తూ, తనలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసలు తన ప్రయాణం మొదలు పెట్టింది.. ‘ఎ మాస్టర్ పీస్, ప్రేరణ, బువ్వమ్మ కథలు, భామ సత్యభామ’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణం ప్రారంభించినా కూడా ‘కిల్లర్’ ముందుగా విడుదల అవుతోంది. దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటుడిగా కనిపించడమే కాకుండా, లైన్‌ ప్రొడ్యూసర్‌గా కూడా దశరథ బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. అంటే ఇది ఆయనకు కేవలం నటనలో తొలి అడుగు మాత్రమే కాదు.. సినిమా నిర్మాణ ప్రక్రియలోనూ తన అనుభవాన్ని చాటుకునే వేదిక. తన సినీ కలను సాకారం చేసుకునేందుకు ‘కిల్లర్‌’ను ఓ కీలకమైన అవకాశంగా మలుచుకుంటున్నారు.కెరీర్‌లో ఎదగాలనే ఆశయం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్నవారి కష్టాలను గుర్తించి స్పందించే హృదయం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలోనూ దశరథ మాధవ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు రామచంద్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఆయన, ఆర్థిక సహాయం అందించి తన వంతు అండగా నిలిచారు. తోటి కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించడం, తనకు చేతనైన సహాయం చేయడం ఆయనలోని మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలవడం అభినందనీయం. పేరు, గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తించాలనే ఆలోచన ఆయన వ్యక్తిత్వానికి మరో కోణాన్ని పరిచయం చేస్తోంది.ఒక నటుడు అవడమంటే చిన్న విషయం కాదు.. దీని వెనుక ఎంతో కష్టం... ఎన్నో అవమానాలుంటాయి. అలాగే అందించిన చేతులూ ఉంటాయి. అలా అవమానాలను దిగ మింగుకుని.. అందించిన చేతిని వదలకుండా తన లక్ష్యం వైపు దశరధ మాధవ్ అడుగులు వేశారు. దశరథ మాధవ్‌ ముందున్న లక్ష్యం స్పష్టం. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. నటుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలి. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రయాణంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలన్నదే ఆయన ఆశయం. ‘కిల్లర్‌’తో ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం ఆయనకు ఎలాంటి అనుభవాలను అందిస్తుంది? ప్రేక్షకుల ముందుకు నటుడిగా వస్తున్న దశరథ మాధవ్‌ తన నటనతో ఎంతవరకు ఆకట్టుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.మరింత చదవండి

Source link