ప్రభన్యూస్

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. పుట్టినరోజు వేళా హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ ఆవేదన | తెలుగు సినిమా వార్తలు


ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షిరాజ్ మెహదీ అన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించి సినిమాలు రూపొందిస్తున్నా.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సరైన అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, మిగిలిన సినిమాలు థియేటర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. పెట్టుబడులు తిరిగి రాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఓ అందాల రాక్షసి’కి థియేటర్లేవీ?

తన సినిమా ‘ఓ అందాల రాక్షసి’ విడుదల కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదని షిరాజ్ మెహదీ తెలిపారు. గత నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు కష్టంగా మారిందని, హైదరాబాద్‌లోనూ పరిమిత సంఖ్యలో స్క్రీన్లు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. థియేటర్లలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలు చివరి నిమిషం వరకు తెలియకపోవడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన చిత్రానికి ఆడియో, ఓటీటీ, శాటిలైట్‌, ఇతర భాషల హక్కుల విషయంలోనూ ఆశించిన అవకాశాలు లభించలేదని పేర్కొన్నారు.

ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన:

చిన్న సినిమాల సమస్యలపై పలుమార్లు ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి కనీస స్పందన కూడా రాలేదని షిరాజ్ మెహదీ అన్నారు. సంబంధిత సంస్థలు, సినీ రంగ ప్రముఖులకు నోటీసులు, ఫిర్యాదులు అందించినా పరిష్కారం లభించలేదని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయపరమైన మార్గాలను కూడా ఆశ్రయించానని, అయినప్పటికీ తన సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నరగా ఒంటరిగానే పోరాటం చేస్తున్నానని, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

పరిశ్రమలో మార్పు రావాలి..

ఊటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం దుబాయ్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ అభ్యసించానని, ఆ తర్వాత దర్శకత్వంలో శిక్షణ తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చానని షిరాజ్ మెహదీ వివరించారు. ‘పాడుచీకటి’, ‘కేఎస్‌ 100’, ‘యు ఆర్‌ మై హీరో’, ‘పౌరుషం’, ‘ఓ అందాల రాక్షసి’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ న్యాయమైన అవకాశాలు లభించే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.

చిన్న సినిమాల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేస్తున్నారు. థియేటర్ల కేటాయింపు, సినిమా విడుదల, ఇతర హక్కులకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా పరిశీలించి, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించి, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంచి సినిమాలు రూపొందించే వారికి సరైన అవకాశాలు లభించినప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 11:33 pm Digital Edition : Prabhanews
చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. పుట్టినరోజు వేళా హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ ఆవేదన | తెలుగు సినిమా వార్తలు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షిరాజ్ మెహదీ అన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించి సినిమాలు రూపొందిస్తున్నా.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సరైన అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, మిగిలిన సినిమాలు థియేటర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. పెట్టుబడులు తిరిగి రాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఓ అందాల రాక్షసి’కి థియేటర్లేవీ?తన సినిమా ‘ఓ అందాల రాక్షసి’ విడుదల కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదని షిరాజ్ మెహదీ తెలిపారు. గత నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు కష్టంగా మారిందని, హైదరాబాద్‌లోనూ పరిమిత సంఖ్యలో స్క్రీన్లు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. థియేటర్లలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలు చివరి నిమిషం వరకు తెలియకపోవడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన చిత్రానికి ఆడియో, ఓటీటీ, శాటిలైట్‌, ఇతర భాషల హక్కుల విషయంలోనూ ఆశించిన అవకాశాలు లభించలేదని పేర్కొన్నారు.ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన:చిన్న సినిమాల సమస్యలపై పలుమార్లు ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి కనీస స్పందన కూడా రాలేదని షిరాజ్ మెహదీ అన్నారు. సంబంధిత సంస్థలు, సినీ రంగ ప్రముఖులకు నోటీసులు, ఫిర్యాదులు అందించినా పరిష్కారం లభించలేదని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయపరమైన మార్గాలను కూడా ఆశ్రయించానని, అయినప్పటికీ తన సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నరగా ఒంటరిగానే పోరాటం చేస్తున్నానని, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.పరిశ్రమలో మార్పు రావాలి..ఊటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం దుబాయ్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ అభ్యసించానని, ఆ తర్వాత దర్శకత్వంలో శిక్షణ తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చానని షిరాజ్ మెహదీ వివరించారు. ‘పాడుచీకటి’, ‘కేఎస్‌ 100’, ‘యు ఆర్‌ మై హీరో’, ‘పౌరుషం’, ‘ఓ అందాల రాక్షసి’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ న్యాయమైన అవకాశాలు లభించే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.చిన్న సినిమాల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేస్తున్నారు. థియేటర్ల కేటాయింపు, సినిమా విడుదల, ఇతర హక్కులకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా పరిశీలించి, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించి, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంచి సినిమాలు రూపొందించే వారికి సరైన అవకాశాలు లభించినప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

Source link