అందుకే నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాలనే విషయాన్ని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదని శెట్టి సూచిస్తున్నారు. ఒక్కో చెల్లింపు విధానంలో చివరికి ఎంత ఖర్చవుతుందో పోల్చి చూడాలి. “చేతిలో సరిపడా డబ్బు ఉంటే, ఒకేసారి చెల్లించడం సాధారణంగా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అయితే, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు నెలవారీ ఖర్చులపై భారం పడకుండా డబ్బును విడతలుగా చెల్లించడానికి ఈఎంఐ ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాల్లోనే ఈఎంఐని ఎంచుకోవడం మంచిది” అని ఆయన చెప్పారు. ఏది ఎంచుకోవాలనేది చివరికి వస్తువు మొత్తం ధర, మన ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి డబ్బు చెల్లించడం వల్ల మంచి డిస్కౌంట్ లభిస్తే, దానివల్ల అత్యవసర అవసరాల కోసం దాచుకున్న పొదుపు మొత్తం తగ్గిపోకపోతే ముందుగానే చెల్లించడం మంచిది. మరోవైపు, అత్యవసరమైన, ఎక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐ నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ మనకు అందుబాటులో ఉండే మొత్తానికి సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)

