ఈ ఉచిత బ్యూటీషియన్ కోర్సులో చేరాలనుకునే మహిళలకు కొన్ని కనీస అర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు కచ్చితంగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 45 ఏళ్ల లోపు ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన ఆసక్తిగల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బయట వేల రూపాయలు ఖర్చు చేస్తే కానీ నేర్చుకోలేని ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా అందిస్తుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు ఈ సువర్ణావకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

