తిరుపతి, అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. పండుగల సీజన్లో రైలు టికెట్లు దొరకడం కష్టంగా ఉన్నవారికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి, అరుణాచలంతో పాటు కేరళ, తమిళనాడు, మంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లలో ఇంకా ఖాళీ బెర్తులు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. 2026 అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణించాలనుకునేవారు ఈ రైళ్లలో టికెట్ల లభ్యతను చూసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, అక్టోబర్ 26 రాత్రి 8 గంటల సమయానికి ఖాళీ బెర్తుల లెక్కలు ఇలా ఉన్నాయి. చర్లపల్లి నుంచి తిరువణ్ణామలై వెళ్లే రెండు ప్రత్యేక రైళ్లలో అందుబాటులో ఉన్న తేదీలన్నీ కలిపి మొత్తం 1,391 ఖాళీ బెర్తులు ఉన్నాయి. జల్నా-తిరుపతి ప్రత్యేక రైలులో 1,256 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హెచ్.ఎస్. నాందేడ్-తిరుచానూరు ప్రత్యేక రైలులో 2,981 ఖాళీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

