ప్రభన్యూస్

Rashmika-Vijay: ‘మా జీవితాలు మా ఇష్టం’… రష్మిక మందన్న సంచలన పోస్ట్.. ఇలా ఫైర్ అయిందేంటి రష్ అక్క! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రష్మిక మందన్నా తన పర్సనల్ లైఫ్‌, రీసెంట్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండ (‘విజ్జు’)తో తనకున్న బంధం, వివాహంపై ఇంటర్నెట్‌లో వస్తున్న నెగెటివ్ కామెంట్స్, ఉచిత సలహాలకు చెక్ పెడుతూ ఆమె ఒక ఓపెన్ నోట్ విడుదల చేశారు.

News18
News18

రష్మిక మందన్నా తన పర్సనల్ లైఫ్‌, రీసెంట్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండ (‘విజ్జు’)తో తనకున్న బంధం, వివాహంపై ఇంటర్నెట్‌లో వస్తున్న నెగెటివ్ కామెంట్స్, ఉచిత సలహాలకు చెక్ పెడుతూ ఆమె ఒక ఓపెన్ నోట్ విడుదల చేశారు.

రష్మిక తన పోస్టులో తమ జీవితాలను సొంత నిర్ణయాలతో, కష్టపడి నిర్మించుకున్నామని చెప్పారు. తామిద్దరం స్వతంత్రంగా ఆలోచించగలిగే వ్యక్తులమని, తమ జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో స్పష్టత ఉందని పేర్కొన్నారు. ఎలా జీవించాలి, ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనే విషయాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలిపారు.

“మేమిద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం. జీవితాంతం మళ్లీ మళ్లీ ఒకరినొకరం ఎంచుకుంటూనే ఉంటాం” అనే భావాన్ని వ్యక్తం చేస్తూ తన పోస్ట్‌లో హృదయ ఆకారంలోని ఎమోజీని కూడా జత చేశారు. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తామే తీసుకున్నామని, వాటి విషయంలో ఇతరుల అభిప్రాయాల కంటే తమకు ఏది సంతోషాన్ని ఇస్తుందనేదే ముఖ్యమని ఆమె చెప్పినట్లుగా ఈ పోస్ట్‌లోని వ్యాఖ్యలు ఉన్నాయి.

అంతేకాదు.. తమ ప్రేమ ఇతరులు ఊహించుకున్న విధంగా లేకపోయినా ఇబ్బంది లేదని రష్మిక పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో తాము కోరుకున్న విధంగా జీవించాలని, తమకు నచ్చిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని అన్నారు. ఇతరుల జీవితాలు తమ ఆలోచనలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన వాటిని తప్పుగా చూడకూడదనే సందేశాన్ని కూడా ఆమె తన పోస్టులో ఇచ్చారు.

ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని ఇతరులు సంతోషంగా ఉంటే ఆ ఆనందాన్ని అంగీకరించాలని రష్మిక అభిప్రాయపడ్డారు. ఇతరుల జీవితాలను తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని ఆశించే బదులు, ఎవరి జీవితాన్ని వారు సంతోషంగా గడపాలని సూచించారు. అందరూ ఈ విధమైన ఆలోచనతో ఉండటమే సమాజంలో ఉండాల్సిన కనీస విలువ అని ఆమె పేర్కొన్నారు.

రష్మిక తన పోస్టులో ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. అయితే ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌పై కూడా నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 3:45 pm Digital Edition : Prabhanews
Rashmika-Vijay: ‘మా జీవితాలు మా ఇష్టం’… రష్మిక మందన్న సంచలన పోస్ట్.. ఇలా ఫైర్ అయిందేంటి రష్ అక్క! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 26, 2026 3:41 PM ISTరష్మిక మందన్నా తన పర్సనల్ లైఫ్‌, రీసెంట్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండ (‘విజ్జు’)తో తనకున్న బంధం, వివాహంపై ఇంటర్నెట్‌లో వస్తున్న నెగెటివ్ కామెంట్స్, ఉచిత సలహాలకు చెక్ పెడుతూ ఆమె ఒక ఓపెన్ నోట్ విడుదల చేశారు.
News18రష్మిక మందన్నా తన పర్సనల్ లైఫ్‌, రీసెంట్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండ (‘విజ్జు’)తో తనకున్న బంధం, వివాహంపై ఇంటర్నెట్‌లో వస్తున్న నెగెటివ్ కామెంట్స్, ఉచిత సలహాలకు చెక్ పెడుతూ ఆమె ఒక ఓపెన్ నోట్ విడుదల చేశారు.రష్మిక తన పోస్టులో తమ జీవితాలను సొంత నిర్ణయాలతో, కష్టపడి నిర్మించుకున్నామని చెప్పారు. తామిద్దరం స్వతంత్రంగా ఆలోచించగలిగే వ్యక్తులమని, తమ జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో స్పష్టత ఉందని పేర్కొన్నారు. ఎలా జీవించాలి, ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనే విషయాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలిపారు.“మేమిద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం. జీవితాంతం మళ్లీ మళ్లీ ఒకరినొకరం ఎంచుకుంటూనే ఉంటాం” అనే భావాన్ని వ్యక్తం చేస్తూ తన పోస్ట్‌లో హృదయ ఆకారంలోని ఎమోజీని కూడా జత చేశారు. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తామే తీసుకున్నామని, వాటి విషయంలో ఇతరుల అభిప్రాయాల కంటే తమకు ఏది సంతోషాన్ని ఇస్తుందనేదే ముఖ్యమని ఆమె చెప్పినట్లుగా ఈ పోస్ట్‌లోని వ్యాఖ్యలు ఉన్నాయి.అంతేకాదు.. తమ ప్రేమ ఇతరులు ఊహించుకున్న విధంగా లేకపోయినా ఇబ్బంది లేదని రష్మిక పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో తాము కోరుకున్న విధంగా జీవించాలని, తమకు నచ్చిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని అన్నారు. ఇతరుల జీవితాలు తమ ఆలోచనలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన వాటిని తప్పుగా చూడకూడదనే సందేశాన్ని కూడా ఆమె తన పోస్టులో ఇచ్చారు.ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని ఇతరులు సంతోషంగా ఉంటే ఆ ఆనందాన్ని అంగీకరించాలని రష్మిక అభిప్రాయపడ్డారు. ఇతరుల జీవితాలను తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని ఆశించే బదులు, ఎవరి జీవితాన్ని వారు సంతోషంగా గడపాలని సూచించారు. అందరూ ఈ విధమైన ఆలోచనతో ఉండటమే సమాజంలో ఉండాల్సిన కనీస విలువ అని ఆమె పేర్కొన్నారు.రష్మిక తన పోస్టులో ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. అయితే ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌పై కూడా నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.మరింత చదవండి

Source link