రైల్వే ఉద్యోగులు అంటే భారతీయ రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులు అని అర్థం. ఇందులో రైలు డ్రైవర్లు (లోకో పైలట్లు), టికెట్ చెకింగ్ సిబ్బంది (టీటీఈలు), స్టేషన్ మాస్టర్లు, ఇంజినీర్లు, రైల్వే వర్క్‌షాప్ సిబ్బంది, క్లర్కులు, ఆఫీస్ ఉద్యోగులు ఇలా రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉన్న రైల్వే ఉద్యోగులకు ఇల్లు నిర్మించుకోవడం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఏ) అనే రుణ సదుపాయం అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

