ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాల గురించి ఎన్నో సూత్రాలను వివరించారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి, సమస్యలను తెలివిగా ఎదుర్కోవడానికి కొన్ని అలవాట్లు అవసరమని ఆయన బోధనలు చెబుతాయి. ప్రస్తుతం చాలామంది తమ వ్యక్తిగత విషయాలు, ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను సోషల్ మీడియాలో బహిరంగంగా పంచుకుంటున్నారు. అయితే ప్రతి విషయాన్ని అందరితో చెప్పడం మంచిది కాదు. ఎవరితో ఏ విషయం పంచుకోవాలి, ఏ విషయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి అనే అవగాహన ఉండాలి. చాణక్య నీతి బోధనల ప్రకారం, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా ఇతరులతో పంచుకోవాలి.

