హోమ్ లోన్ ఆమోదం కేవలం సిబిల్ స్కోర్ లేదా అధిక ఆదాయంపై మాత్రమే ఆధారపడదు. రుణగ్రహీత ఆర్థిక విశ్వసనీయత, ఆదాయ స్థిరత్వం, ఇప్పటికే ఉన్న అప్పులు, రుణ చెల్లింపు సామర్థ్యం, కొనుగోలు చేసే ఆస్తి నాణ్యత వంటి అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి. అందువల్ల సొంతింటి కొనుగోలుకు సిద్ధమయ్యే ముందు క్రెడిట్ స్కోర్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా, మొత్తం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం, ఆదాయ పన్ను రికార్డులను సక్రమంగా నిర్వహించడం, ఆస్తి పత్రాలను ముందుగానే పరిశీలించుకోవడం ముఖ్యం. Expert Advice by: CA Akhil Kancherla, Akhil Kancherla & Associates, 8143232113, akandassociates2025@gmail.com (ప్రతీకాత్మక చిత్రం)

