2. ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ విడుదల… గ్యాస్ అసంపూర్ణంగా మండి పసుపు రంగు మంట వచ్చినప్పుడు కంటికి కనిపించని, వాసన లేని ‘కార్బన్ మోనాక్సైడ్’ అనే అత్యంత విషపూరితమైన వాయువు ఉత్పత్తి అవుతుంది. వంటింట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే ఈ గ్యాస్ గదిలోనే నిండిపోయి శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఇది తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

