ప్రభన్యూస్

ఒక్కసారి నాటితే చాలు.. రెండేళ్ల పాటు వరుసగా వంకాయల దిగుబడి! యువ రైతు వినూత్న ప్రయోగం! |


Last Updated:

తక్కువ భూమిలోనే ఎక్కువ కాలం వంకాయ దిగుబడి పొందేందుకు బీహార్ యువ రైతు ధర్మవీర్ సింగ్ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొక్కలను సరైన సమయంలో కత్తిరించి సంరక్షిస్తే రెండేళ్ల వరకు పంట పొందవచ్చని ఆయన చెబుతున్నారు.

News18
News18

తక్కువ భూమి ఉన్న రైతులు కొత్త పద్ధతులను పాటిస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా ఇంటి ఆవరణ, టెర్రస్, కుండీల్లోనూ కూరగాయలను సాగు చేస్తూ తాజా పంటను పొందుతున్నారు. బీహార్‌లోని ఛప్రా ప్రాంతానికి చెందిన యువ రైతు ధర్మవీర్ సింగ్ కూడా ఇలాంటి వినూత్న వ్యవసాయ పద్ధతులతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల వద్ద శిక్షణ తీసుకున్న ఆయన.. తన పొలంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.

గర్ఖా ప్రఖండ్‌లోని గోధనా (గోపూర్) గ్రామానికి చెందిన ధర్మవీర్ సింగ్ పెద్ద ఎత్తున ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. తన పౌల్ట్రీ ఫామ్ సమీపంలో వంకాయ సాగుపై ఆయన చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది.

ధర్మవీర్ సింగ్ సాగు చేస్తున్న వంకాయ మొక్కల ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి మొక్కను నాటిన తర్వాత సరైన పద్ధతిలో సంరక్షిస్తే దాదాపు రెండేళ్ల వరకు పంటను పొందవచ్చని ఆయన చెబుతున్నారు. సాధారణంగా వంకాయ మొక్క కొంతకాలం తర్వాత దిగుబడి తగ్గి, కొత్త మొక్కలను నాటాల్సి ఉంటుంది. అయితే ధర్మవీర్ అనుసరిస్తున్న పద్ధతిలో పాత మొక్కల నుంచే మళ్లీ కొత్త కొమ్మలు వచ్చేలా చేసి తిరిగి పంటను పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన పొలంలో రెండు రకాల వంకాయ మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి ‘సత్పుటియా’ రకం. దీనికి తెల్లటి వంకాయలు కాస్తాయి. మరో రకం ‘704’. ఈ రకంలో గులాబీ రంగులో ఉండే వంకాయలు వస్తాయి. ఈ రెండు రకాల మొక్కలకు ప్రస్తుతం రెండేళ్ల వయసు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ సమృద్ధిగా కాయలు వస్తున్నాయని రైతు తెలిపారు.

ధర్మవీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ఈ రెండు రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. కొంతకాలం తర్వాత మొక్కల్లో కాయలు రావడం తగ్గిపోయింది. దీంతో మొక్కలను తొలగించకుండా ప్రత్యేకమైన కత్తిరింపు పద్ధతిని అనుసరించారు.

మొక్కల కొమ్మలను భూమి నుంచి సుమారు 9 నుంచి 11 అంగుళాల ఎత్తులో ఉంచి, పైభాగంలోని కొమ్మలను కత్తిరించారు. ఆ తర్వాత మొక్కలకు సమృద్ధిగా నీటిని అందించారు. కొద్దిరోజుల్లోనే కత్తిరించిన మొక్కల నుంచి కొత్త కొమ్మలు, ఆకులు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మొక్కలకు మళ్లీ పూలు, కాయలు విస్తారంగా రావడం మొదలైంది.

రెండో సంవత్సరం ఇదే పద్ధతిని పాటించగా మంచి ఫలితం వచ్చింది. ప్రస్తుతం ఆ మొక్కల్లో భారీగా వంకాయలు కాస్తున్నాయని ధర్మవీర్ చెబుతున్నారు. తక్కువ భూమి ఉన్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు అంటున్నారు. రైతులతో పాటు ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలనుకునే వారు కూడా ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చని చెబుతున్నారు.

ఇంటి టెర్రస్‌పై లేదా పెద్ద కుండీల్లో వంకాయ మొక్కలను పెంచుకుంటూ.. సరైన సంరక్షణ, నీటి నిర్వహణ, కత్తిరింపు పద్ధతిని పాటిస్తే ఎక్కువ కాలం తాజా వంకాయలను పొందే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిసారి కొత్త మొక్కలను కొనుగోలు చేసి నాటాల్సిన అవసరం తగ్గుతుంది. విత్తనాలు, మొక్కలు, నాటే ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని ధర్మవీర్ సింగ్ చెబుతున్నారు.

అయితే కత్తిరింపు, నీటి నిర్వహణ వంటి పద్ధతులను స్థానిక వాతావరణం, మొక్క ఆరోగ్యం, నేల పరిస్థితులకు అనుగుణంగా పాటించడం మంచిదని వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 12:34 pm Digital Edition : Prabhanews
ఒక్కసారి నాటితే చాలు.. రెండేళ్ల పాటు వరుసగా వంకాయల దిగుబడి! యువ రైతు వినూత్న ప్రయోగం! |

Last Updated:Oct 22, 2026 12:30 PM ISTతక్కువ భూమిలోనే ఎక్కువ కాలం వంకాయ దిగుబడి పొందేందుకు బీహార్ యువ రైతు ధర్మవీర్ సింగ్ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొక్కలను సరైన సమయంలో కత్తిరించి సంరక్షిస్తే రెండేళ్ల వరకు పంట పొందవచ్చని ఆయన చెబుతున్నారు.
News18తక్కువ భూమి ఉన్న రైతులు కొత్త పద్ధతులను పాటిస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా ఇంటి ఆవరణ, టెర్రస్, కుండీల్లోనూ కూరగాయలను సాగు చేస్తూ తాజా పంటను పొందుతున్నారు. బీహార్‌లోని ఛప్రా ప్రాంతానికి చెందిన యువ రైతు ధర్మవీర్ సింగ్ కూడా ఇలాంటి వినూత్న వ్యవసాయ పద్ధతులతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల వద్ద శిక్షణ తీసుకున్న ఆయన.. తన పొలంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.గర్ఖా ప్రఖండ్‌లోని గోధనా (గోపూర్) గ్రామానికి చెందిన ధర్మవీర్ సింగ్ పెద్ద ఎత్తున ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. తన పౌల్ట్రీ ఫామ్ సమీపంలో వంకాయ సాగుపై ఆయన చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది.ధర్మవీర్ సింగ్ సాగు చేస్తున్న వంకాయ మొక్కల ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి మొక్కను నాటిన తర్వాత సరైన పద్ధతిలో సంరక్షిస్తే దాదాపు రెండేళ్ల వరకు పంటను పొందవచ్చని ఆయన చెబుతున్నారు. సాధారణంగా వంకాయ మొక్క కొంతకాలం తర్వాత దిగుబడి తగ్గి, కొత్త మొక్కలను నాటాల్సి ఉంటుంది. అయితే ధర్మవీర్ అనుసరిస్తున్న పద్ధతిలో పాత మొక్కల నుంచే మళ్లీ కొత్త కొమ్మలు వచ్చేలా చేసి తిరిగి పంటను పొందుతున్నారు.ప్రస్తుతం ఆయన పొలంలో రెండు రకాల వంకాయ మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి ‘సత్పుటియా’ రకం. దీనికి తెల్లటి వంకాయలు కాస్తాయి. మరో రకం ‘704’. ఈ రకంలో గులాబీ రంగులో ఉండే వంకాయలు వస్తాయి. ఈ రెండు రకాల మొక్కలకు ప్రస్తుతం రెండేళ్ల వయసు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ సమృద్ధిగా కాయలు వస్తున్నాయని రైతు తెలిపారు.ధర్మవీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ఈ రెండు రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. కొంతకాలం తర్వాత మొక్కల్లో కాయలు రావడం తగ్గిపోయింది. దీంతో మొక్కలను తొలగించకుండా ప్రత్యేకమైన కత్తిరింపు పద్ధతిని అనుసరించారు.మొక్కల కొమ్మలను భూమి నుంచి సుమారు 9 నుంచి 11 అంగుళాల ఎత్తులో ఉంచి, పైభాగంలోని కొమ్మలను కత్తిరించారు. ఆ తర్వాత మొక్కలకు సమృద్ధిగా నీటిని అందించారు. కొద్దిరోజుల్లోనే కత్తిరించిన మొక్కల నుంచి కొత్త కొమ్మలు, ఆకులు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మొక్కలకు మళ్లీ పూలు, కాయలు విస్తారంగా రావడం మొదలైంది.రెండో సంవత్సరం ఇదే పద్ధతిని పాటించగా మంచి ఫలితం వచ్చింది. ప్రస్తుతం ఆ మొక్కల్లో భారీగా వంకాయలు కాస్తున్నాయని ధర్మవీర్ చెబుతున్నారు. తక్కువ భూమి ఉన్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు అంటున్నారు. రైతులతో పాటు ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలనుకునే వారు కూడా ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చని చెబుతున్నారు.ఇంటి టెర్రస్‌పై లేదా పెద్ద కుండీల్లో వంకాయ మొక్కలను పెంచుకుంటూ.. సరైన సంరక్షణ, నీటి నిర్వహణ, కత్తిరింపు పద్ధతిని పాటిస్తే ఎక్కువ కాలం తాజా వంకాయలను పొందే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిసారి కొత్త మొక్కలను కొనుగోలు చేసి నాటాల్సిన అవసరం తగ్గుతుంది. విత్తనాలు, మొక్కలు, నాటే ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని ధర్మవీర్ సింగ్ చెబుతున్నారు.అయితే కత్తిరింపు, నీటి నిర్వహణ వంటి పద్ధతులను స్థానిక వాతావరణం, మొక్క ఆరోగ్యం, నేల పరిస్థితులకు అనుగుణంగా పాటించడం మంచిదని వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.మరింత చదవండి

Source link