పాలసీలో చేరేందుకు కనీస వయసు 30 రోజులు. మెచ్యూరిటీ సమయంలో వయసు 100 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఏడాదికి కనీస ప్రీమియం రూ.24,000. గరిష్ఠ ప్రీమియానికి పరిమితి లేదు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ చేసే అంచనా, ఆమోద ప్రక్రియకు ఇది లోబడి ఉంటుంది. పాలసీ ప్రారంభమైనప్పటి నుంచే రిస్క్ కవర్ మొదలవుతుంది. మైనర్ల పేరుతో తీసుకునే పాలసీలకూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుత పన్ను చట్టాలు, వాటికి సంబంధించిన షరతులకు లోబడి పన్ను ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లో అంచనా వేసిన ఐఆర్ఆర్ (ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) 7.06 శాతంగా ఉంది. అయితే ఈ రేటు పాలసీలో చేరే వయసు, చెల్లించే ప్రీమియం, పాలసీ గడువు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ప్రొడక్ట్ వివరాల ప్రకారం, మొదటి రోజు నుంచే 30 రెట్ల లైఫ్ కవర్ అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అలాగే 50 ఏళ్ల వరకు పాలసీ గడువును ఎంచుకోవచ్చు. రైడర్ల ద్వారా అదనపు రక్షణ పొందే అవకాశమూ ఉంది. ఈ 30 రెట్ల లైఫ్ కవర్ ఆఫర్‌ను పరిశ్రమలోనే తొలిసారిగా కంపెనీ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

