ప్రభన్యూస్

Chicken Shawarma: స్ట్రీట్ స్టైల్ చికెన్ షవర్మా ఇంట్లోనే ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది తెలుసా! | లైఫ్ స్టైల్


Last Updated:

Chicken Shawarma: స్ట్రీట్ స్టైల్ చికెన్ షవర్మా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోని పెనంపైనే జ్యూసీ చికెన్, పక్కా గార్లిక్ సాస్ రుచితో క్రంచీగా రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

News18
News18

Chicken Shawarma: స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు అరబిక్ వంటకాల్లో అమితంగా నచ్చే, కమ్మని మయోనైస్ గార్లిక్ సాస్ పూతతో చుట్టే రుచికరమైన రోల్ తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం ‘చికెన్ షవర్మా’ అని గృహిణి కల్పన వివరిస్తున్నారు. పొగలు కక్కే స్మోకీ ఫ్లేవర్ చికెన్, కూరగాయల క్రంచీనెస్‌తో నిండిన ఈ రోల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అమృతంలా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు బయట దొరికేలా చికెన్ ముక్క జ్యూసీగా రాకపోవడం లేదా పిటా బ్రెడ్ చుట్టేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే సాధారణ దోశ పెనంపై పక్కా కేఫ్ స్టైల్ రుచితో, సులభంగా చికెన్ షవర్మా రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు….

బోన్‌లెస్ చికెన్: అర కిలో (సన్నటి పొడవాటి ముక్కలు) మైదా లేదా గోధుమ పిండి: 2 కప్పులు (షవర్మా రోటీల కోసం) చిక్కటి పెరుగు: పావు కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద: 1 పెద్ద చెంచా నిమ్మరసం: 1 పెద్ద చెంచా ఆలివ్ ఆయిల్ లేదా నూనె: 2 పెద్ద చెంచాలు పసుపు: పావు చిన్న చెంచా కాశ్మీరీ కారం పొడి: 1 పెద్ద చెంచా ధనియాల పొడి: 1 చిన్న చెంచా జీలకర్ర పొడి: అర చిన్న చెంచా మిరియాల పొడి: అర చిన్న చెంచా ఒరెగానో / మిక్స్‌డ్ హెర్బ్స్: అర చిన్న చెంచా ఉప్పు: రుచికి సరిపడా

షవర్మా ఫిల్లింగ్ కోసం: క్యాబేజీ తరుగు: అర కప్పు ఉల్లిపాయ తరుగు: అర కప్పు (పొడవుగా కోసినవి) క్యారెట్ తరుగు: పావు కప్పు (సన్నగా తురిమినది) మయోనైస్ లేదా వెల్లుల్లి సాస్: అర కప్పు టమోటా సాస్: 2 పెద్ద చెంచాలు

తయారీ విధానం…

మొదట ఒక గిన్నెలో పెరుగు, ఒక చెంచా నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, హెర్బ్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మసాలా మిశ్రమంలో సన్నగా తరిగిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టించి కనీసం 30 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు గోధుమ పిండి లేదా మైదాలో కొద్దిగా ఉప్పు, నూనె, నీళ్లు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మందపాటి పాన్‌లో చెంచా నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి పెద్ద మంటపై 3 నిమిషాలు వేపండి. ఆ తర్వాత మూతపెట్టి చిన్న మంటపై చికెన్‌లోని నీరంతా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికేవరకు మగ్గనివ్వండి. నీరంతా పోయాక మంట పెంచి చికెన్ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచండి. కలిపి ఉంచిన పిండితో పల్చటి రోటీలు ఒత్తుకుని పెనంపై రెండు వైపులా మెత్తగా కాల్చి తీయండి. ఇప్పుడు ఒక రోటీని తీసుకుని దానిపై మయోనైస్, కొద్దిగా టమోటా సాస్ సమానంగా రాయండి. మధ్యలో వేయించిన చికెన్ ముక్కలు, క్యాబేజీ, ఉల్లిపాయ, క్యారెట్ తరుగును ఉంచి టైట్‌గా రోల్ చేయండి. ఈ రోల్‌ను బటర్‌పేపర్‌లో చుట్టి పెనంపై మరోసారి లేతగా వేడి చేసి తీస్తే వేడివేడి చికెన్ షవర్మా సిద్ధం. అదనపు మయోనైస్ లేదా వెల్లుల్లి సాస్‌తో నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 October 2026, 2:43 pm Digital Edition : Prabhanews
Chicken Shawarma: స్ట్రీట్ స్టైల్ చికెన్ షవర్మా ఇంట్లోనే ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది తెలుసా! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 21, 2026 2:41 PM ISTChicken Shawarma: స్ట్రీట్ స్టైల్ చికెన్ షవర్మా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోని పెనంపైనే జ్యూసీ చికెన్, పక్కా గార్లిక్ సాస్ రుచితో క్రంచీగా రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.News18Chicken Shawarma: స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు అరబిక్ వంటకాల్లో అమితంగా నచ్చే, కమ్మని మయోనైస్ గార్లిక్ సాస్ పూతతో చుట్టే రుచికరమైన రోల్ తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం 'చికెన్ షవర్మా' అని గృహిణి కల్పన వివరిస్తున్నారు. పొగలు కక్కే స్మోకీ ఫ్లేవర్ చికెన్, కూరగాయల క్రంచీనెస్‌తో నిండిన ఈ రోల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అమృతంలా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు బయట దొరికేలా చికెన్ ముక్క జ్యూసీగా రాకపోవడం లేదా పిటా బ్రెడ్ చుట్టేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే సాధారణ దోశ పెనంపై పక్కా కేఫ్ స్టైల్ రుచితో, సులభంగా చికెన్ షవర్మా రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు....బోన్‌లెస్ చికెన్: అర కిలో (సన్నటి పొడవాటి ముక్కలు) మైదా లేదా గోధుమ పిండి: 2 కప్పులు (షవర్మా రోటీల కోసం) చిక్కటి పెరుగు: పావు కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద: 1 పెద్ద చెంచా నిమ్మరసం: 1 పెద్ద చెంచా ఆలివ్ ఆయిల్ లేదా నూనె: 2 పెద్ద చెంచాలు పసుపు: పావు చిన్న చెంచా కాశ్మీరీ కారం పొడి: 1 పెద్ద చెంచా ధనియాల పొడి: 1 చిన్న చెంచా జీలకర్ర పొడి: అర చిన్న చెంచా మిరియాల పొడి: అర చిన్న చెంచా ఒరెగానో / మిక్స్‌డ్ హెర్బ్స్: అర చిన్న చెంచా ఉప్పు: రుచికి సరిపడాషవర్మా ఫిల్లింగ్ కోసం: క్యాబేజీ తరుగు: అర కప్పు ఉల్లిపాయ తరుగు: అర కప్పు (పొడవుగా కోసినవి) క్యారెట్ తరుగు: పావు కప్పు (సన్నగా తురిమినది) మయోనైస్ లేదా వెల్లుల్లి సాస్: అర కప్పు టమోటా సాస్: 2 పెద్ద చెంచాలుతయారీ విధానం...మొదట ఒక గిన్నెలో పెరుగు, ఒక చెంచా నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, హెర్బ్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మసాలా మిశ్రమంలో సన్నగా తరిగిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టించి కనీసం 30 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు గోధుమ పిండి లేదా మైదాలో కొద్దిగా ఉప్పు, నూనె, నీళ్లు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మందపాటి పాన్‌లో చెంచా నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి పెద్ద మంటపై 3 నిమిషాలు వేపండి. ఆ తర్వాత మూతపెట్టి చిన్న మంటపై చికెన్‌లోని నీరంతా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికేవరకు మగ్గనివ్వండి. నీరంతా పోయాక మంట పెంచి చికెన్ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచండి. కలిపి ఉంచిన పిండితో పల్చటి రోటీలు ఒత్తుకుని పెనంపై రెండు వైపులా మెత్తగా కాల్చి తీయండి. ఇప్పుడు ఒక రోటీని తీసుకుని దానిపై మయోనైస్, కొద్దిగా టమోటా సాస్ సమానంగా రాయండి. మధ్యలో వేయించిన చికెన్ ముక్కలు, క్యాబేజీ, ఉల్లిపాయ, క్యారెట్ తరుగును ఉంచి టైట్‌గా రోల్ చేయండి. ఈ రోల్‌ను బటర్‌పేపర్‌లో చుట్టి పెనంపై మరోసారి లేతగా వేడి చేసి తీస్తే వేడివేడి చికెన్ షవర్మా సిద్ధం. అదనపు మయోనైస్ లేదా వెల్లుల్లి సాస్‌తో నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.మరింత చదవండి

Source link