ఇక ఖర్చు విషయానికి వస్తే.. ఒక్కో ఎర్ర ఇటుక ధర, ఒక్కో AAC బ్లాక్ ధరను మాత్రమే పోల్చి నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మెటీరియల్ ధరతో పాటు రవాణా, మేస్త్రీ కూలీ, మోర్టార్ లేదా అడ్హెసివ్, ప్లాస్టరింగ్, నిర్మాణానికి పట్టే సమయం వంటి అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో AAC బ్లాక్స్‌తో మొత్తం ఖర్చు తగ్గే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎర్ర ఇటుకలే అందుబాటు ధరలో లభించవచ్చు. అందుకే మీ బడ్జెట్, ఇంటి డిజైన్, స్థానికంగా మెటీరియల్ లభ్యతను పరిశీలించి సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీర్ సలహాతో నిర్ణయం తీసుకోవడం మంచిది.

