ప్రభన్యూస్

Sai Pallavi: రామాయణలో అందుకే భాగమయ్యా.. భవిష్యత్ తరాలకు ఇది ఓ కానుక | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రామాయణ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొని తన సినిమా అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇతిహాస చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ ఫేమ్, ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, కనీవినీ ఎరుగని దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ విజువల్ వండర్ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొని తన సినిమా అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. “భవిష్యత్‌లో ఈ ‘రామాయణ’ చిత్రాన్ని చూసినప్పుడు, అందులోని సీతమ్మ పాత్రలో ప్రేక్షకులకు ఒక దైవత్వం కనిపించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను ఈ ప్రాజెక్ట్‌లో నటించాను” అని స్పష్టం చేశారు. రామాయణం మనందరి జీవితాల్లో విడదీయరాని భాగమని, ఇప్పుడు ఈ గొప్ప ఇతిహాసాన్ని భారతదేశం ఎల్లలు దాటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మరింతగా చేరువ చేయబోతున్నామని ఆమె ఉద్ఘాటించారు. రాబోయే భవిష్యత్ తరాలకు తాము అందిస్తున్న ఓ అద్భుతమైన, అమూల్యమైన కానుక ఈ సినిమా అని సాయి పల్లవి తెలిపారు.

సీత పాత్రను పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నానని,ఈ పవిత్రమైన పాత్ర ద్వారా మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నానని, తన వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులు వచ్చాయని తెలిపారు. అభిమానుల ఉత్సాహం మధ్య ఆమె స్టేజిపై హిందీలో ఒక శ్రీరాముడి భజన పాటను పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం వెనుక ఉన్న కష్టం గురించి వివరిస్తూ.. నటీనటులమైన తాము గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు పనిచేస్తుంటే, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాతలు మాత్రం దాదాపు పదేళ్లుగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తపస్సులా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఈ చిత్రంలో రాక్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సినిమా షూటింగ్ ప్రధానంగా హిందీలో జరిగినప్పటికీ, అందులోని భావోద్వేగాలు విశ్వజనీనం కాబట్టి తెలుగు ప్రేక్షకులకు అత్యంత సహజంగా, సులభంగా అర్థం అవుతుందని ఆమె భరోసా ఇచ్చారు.

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి చిత్ర బృందం ఎంతో రీసెర్చ్ చేసిందని, తాము చదవాల్సిన పుస్తకాలను సైతం వారే ప్రత్యేకంగా సూచించారని సాయి పల్లవి వెల్లడించారు. తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి దివంగత లెజెండరీ నటులు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రాలను, సీతారామ కళ్యాణం లాంటి అద్భుతాలను, అలాగే ఇటీవల తెలుగులో వచ్చిన రామాయణ సంబంధిత కంటెంట్‌ను కూడా తాను వీక్షించినట్లు ఆమె తెలిపారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 9:53 am Digital Edition : Prabhanews
Sai Pallavi: రామాయణలో అందుకే భాగమయ్యా.. భవిష్యత్ తరాలకు ఇది ఓ కానుక | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 20, 2026 9:46 AM IST రామాయణ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొని తన సినిమా అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.News18బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇతిహాస చిత్రం 'రామాయణ' (Ramayana). దంగల్ ఫేమ్, ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, కనీవినీ ఎరుగని దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ విజువల్ వండర్ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొని తన సినిమా అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.సాయి పల్లవి మాట్లాడుతూ.. "భవిష్యత్‌లో ఈ 'రామాయణ' చిత్రాన్ని చూసినప్పుడు, అందులోని సీతమ్మ పాత్రలో ప్రేక్షకులకు ఒక దైవత్వం కనిపించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను ఈ ప్రాజెక్ట్‌లో నటించాను" అని స్పష్టం చేశారు. రామాయణం మనందరి జీవితాల్లో విడదీయరాని భాగమని, ఇప్పుడు ఈ గొప్ప ఇతిహాసాన్ని భారతదేశం ఎల్లలు దాటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మరింతగా చేరువ చేయబోతున్నామని ఆమె ఉద్ఘాటించారు. రాబోయే భవిష్యత్ తరాలకు తాము అందిస్తున్న ఓ అద్భుతమైన, అమూల్యమైన కానుక ఈ సినిమా అని సాయి పల్లవి తెలిపారు.సీత పాత్రను పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నానని,ఈ పవిత్రమైన పాత్ర ద్వారా మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నానని, తన వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులు వచ్చాయని తెలిపారు. అభిమానుల ఉత్సాహం మధ్య ఆమె స్టేజిపై హిందీలో ఒక శ్రీరాముడి భజన పాటను పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రం వెనుక ఉన్న కష్టం గురించి వివరిస్తూ.. నటీనటులమైన తాము గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు పనిచేస్తుంటే, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాతలు మాత్రం దాదాపు పదేళ్లుగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తపస్సులా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఈ చిత్రంలో రాక్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సినిమా షూటింగ్ ప్రధానంగా హిందీలో జరిగినప్పటికీ, అందులోని భావోద్వేగాలు విశ్వజనీనం కాబట్టి తెలుగు ప్రేక్షకులకు అత్యంత సహజంగా, సులభంగా అర్థం అవుతుందని ఆమె భరోసా ఇచ్చారు.పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి చిత్ర బృందం ఎంతో రీసెర్చ్ చేసిందని, తాము చదవాల్సిన పుస్తకాలను సైతం వారే ప్రత్యేకంగా సూచించారని సాయి పల్లవి వెల్లడించారు. తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి దివంగత లెజెండరీ నటులు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రాలను, సీతారామ కళ్యాణం లాంటి అద్భుతాలను, అలాగే ఇటీవల తెలుగులో వచ్చిన రామాయణ సంబంధిత కంటెంట్‌ను కూడా తాను వీక్షించినట్లు ఆమె తెలిపారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.మరింత చదవండి

Source link