ప్రభన్యూస్

RC 17: రామ్‌ చరణ్- సుకుమార్ బిగ్ ప్లాన్.. ఇక మెగా ఫ్యాన్స్‌కి కిక్కు దిగదేమో..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రామ్‌ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్ లోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

News18
News18

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చరణ్ ‘RRR’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోగా, సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్-ఇండియా రికార్డులను తిరగరాశారు. దీంతో ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతోందన్న వార్త సినీ ప్రియులను ఎంతగానో ఉత్సాహపరుస్తోంది. తాజాగా మరో వారం రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరికొత్త లీక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కథలోని భారీతనం, విస్తృతమైన నేపథ్యం దృష్ట్యా ‘RC17’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కథ డిమాండ్ మేరకు తొలి భాగాన్ని 2028 మధ్యలో, రెండో భాగాన్ని 2029 ప్రారంభంలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటివరకు భారతీయ సినిమాలో పలు భారీ ప్రాజెక్టుల సీక్వెల్స్ మధ్య రెండేళ్లకు పైగా సమయం పడుతుండగా, సుకుమార్ మాత్రం షూటింగ్‌ను సమాంతరంగా పూర్తి చేసి తక్కువ వ్యవధిలోనే రెండు భాగాలను రిలీజ్ చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

టెక్నికల్ పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం కానుంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కు స్వరాలు అందించనున్నారని సమాచారం. హీరోయిన్‌గా ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రా మాస్ ఎలిమెంట్స్‌, భావోద్వేగమైన కథాంశం, గ్రాండ్‌ విజువల్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సుక్కు–చెర్రీ జోడీ పక్కా స్కెచ్ వేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 4:41 pm Digital Edition : Prabhanews
RC 17: రామ్‌ చరణ్- సుకుమార్ బిగ్ ప్లాన్.. ఇక మెగా ఫ్యాన్స్‌కి కిక్కు దిగదేమో..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 4:03 PM ISTరామ్‌ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్ లోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. News18గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చరణ్ ‘RRR’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోగా, సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్-ఇండియా రికార్డులను తిరగరాశారు. దీంతో ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతోందన్న వార్త సినీ ప్రియులను ఎంతగానో ఉత్సాహపరుస్తోంది. తాజాగా మరో వారం రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరికొత్త లీక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కథలోని భారీతనం, విస్తృతమైన నేపథ్యం దృష్ట్యా ‘RC17’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కథ డిమాండ్ మేరకు తొలి భాగాన్ని 2028 మధ్యలో, రెండో భాగాన్ని 2029 ప్రారంభంలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటివరకు భారతీయ సినిమాలో పలు భారీ ప్రాజెక్టుల సీక్వెల్స్ మధ్య రెండేళ్లకు పైగా సమయం పడుతుండగా, సుకుమార్ మాత్రం షూటింగ్‌ను సమాంతరంగా పూర్తి చేసి తక్కువ వ్యవధిలోనే రెండు భాగాలను రిలీజ్ చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.టెక్నికల్ పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం కానుంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కు స్వరాలు అందించనున్నారని సమాచారం. హీరోయిన్‌గా ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రా మాస్ ఎలిమెంట్స్‌, భావోద్వేగమైన కథాంశం, గ్రాండ్‌ విజువల్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సుక్కు–చెర్రీ జోడీ పక్కా స్కెచ్ వేస్తోంది.మరింత చదవండి

Source link