ప్రభన్యూస్

Viral News: 16ఏళ్ల బాలుడికి కంట్లో పెరిగిన దంతం.. వరల్డ్‌లో ఫస్ట్ కేసు మన దగ్గరే జరగడం విశేషం | ట్రెండింగ్


అసలు విషయం ఏమిటి..?

మధురైలోని అరవింద్ కంటి ఆసుపత్రికి 16 ఏళ్ల బాలుడు చికిత్స కోసం వెళ్లాడు. గత నెల రోజులుగా అతని ఎడమ కనురెప్ప వాచి ఉంది. అయితే అతనికి ఎటువంటి నొప్పి లేదు. అలాగే గతంలో ఆ కంటి దగ్గర ఎటువంటి గాయం కూడా కాలేదు. వాపుకు గల కారణం తెలియకపోవడంతో అతను వైద్య పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే హాస్పిటల్‌కి వెళ్లినట్లుగా న్యూస్18 పంజాబ్ కథనంలో పేర్కొంది.

నొప్పి లేదు గాయం కాలేదు..

టీనేజ్ వయసులో ఉన్న బాలుడ్ని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించారు అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులు. కంటి వాపు ఉన్న ప్రాంతంలో గట్టిగా, తెల్లగా, బయటకు పొడుచుకు వచ్చినట్లున్న రెండు వస్తువులను గమనించారు. సీటీ (CT) స్కాన్‌లో కంటి కుహరం పైభాగం నుండి దంతం వంటి నిర్మాణం ఒకటి బయటకు వస్తున్నట్లు గుర్తించారు. ఇందులో దంతానికి ఉండే కిరీట భాగం (crown), వేరు (root) రెండూ ఉన్నాయి. దంతంలాంటి రెండు మొనదేలిన భాగాలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపించాయి.

కుక్క పన్ను..

హెల్త్ & మీ నివేదిక ప్రకారం ఈ ఉబ్బిన ప్రాంతాలు తాకినప్పుడు చాలా నునుపుగా, గట్టిగా ఉన్నాయని డాక్టర్ మేఘనా తన్వర్ తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆ వస్తువును తొలగించారు. పరీక్షలో అది పూర్తిగా పెరిగిన కోరపల్లు అని అంటే కుక్క పంటిని పోలిన పల్లు అని నిర్ధారణ అయింది. కణితికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదు. వైద్య పరిభాషలో దీనిని ‘ఎక్టోపిక్ టూత్’ (స్థానభ్రంశం చెందిన పంటి) అని అంటారు.

ఎక్టోపిక్ టూత్ (ectopic tooth) అంటే ఏమిటి?

ఎక్టోపిక్ టూత్ అంటే తన సహజ స్థానంలో కాకుండా వేరే చోట అభివృద్ధి చెందే లేదా బయటకు వచ్చే దంతం. కొన్ని దంతాలు నోటి లోపలే తప్పు స్థానాల్లో ఉండవచ్చు. మరికొన్ని శరీరంలోని పూర్తిగా భిన్నమైన భాగాలలో కూడా అభివృద్ధి చెందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

డాక్టర్లు చెప్పిన మాటలు..

ఈ బాలుడి కేసు భిన్నమైనది. అతని పన్ను కంటికి పైన ఉన్న ప్రాంతంలో ఉంది. సాధారణంగా అక్కడ పన్ను ఉంటుందని ఎవరూ ఊహించలేరు. ప్రారంభంలో వైద్యులు ఇది ‘టెరాటోమా’ (teratoma) అనే ఒక రకమైన కణితి కావచ్చునని అనుమానించారు. ఇటువంటి కణితిలో ఎముక లేదా దంత కణజాలం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స ద్వారా తొలగించిన నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత అది కణితి కాదని పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక నిజమైన పన్నేనని స్పష్టమైంది.

(ఎక్టోపిక్ టూత్ (ectopic tooth) అంటే తప్పు స్థానంలో మొలిచే లేదా అభివృద్ధి చెందే దంతం)

కండీషన్‌ని బట్టి సర్జరీ..

స్థానభ్రంశం చెందిన దంతాన్ని తీసివేయాలా వద్దా అనేది అది ఉన్న ప్రదేశం,అది ఏవైనా సమస్యలను కలిగిస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ దంతం విడిగా ఉండి, ఎటువంటి లక్షణాలను కలిగించకపోతే ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు దానిని కేవలం పర్యవేక్షిస్తారు. అయితే ఆ పంటి వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే ఒక మార్గానికి అడ్డుపడితే చుట్టుపక్కల నిర్మాణాలను దెబ్బతీస్తే, లేదా దానితో పాటు సిస్ట్ ఉంటే, అప్పుడు శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించడం అవసరం అవుతుంది. వైద్యులు ఒక దంతం ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవడానికి , దాని చుట్టూ ఉన్న నిర్మాణాలను గుర్తించడానికి స్కాన్‌లను ఉపయోగిస్తారు. CT స్కాన్ ద్వారా ఆ దంతం కళ్లు, నరాలు లేదా రక్తనాళాలకు ఎంత దగ్గరగా ఉందో తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగా శస్త్రచికిత్స చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.

ముక్కులో వస్తే..

ఒకవేళ దంతం ముక్కులో లేదా సైనస్‌లో ఉన్నట్లయితే వైద్యులు తరచుగా ఎండోస్కోప్‌ను ఉపయోగిస్తారు. ఇది కెమెరా శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను కలిగి ఉండే ఒక సన్నని గొట్టం. దీని సహాయంతో పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే ముక్కు మార్గం ద్వారా ఆ దంతాన్ని తొలగించవచ్చు. ఒక సమీక్షలో ఈ పద్ధతిని ఉపయోగించి ముక్కు లేదా సైనస్‌లలో ఉన్న అసాధారణ దంతాలను తొలగించిన 27 కేసులను గుర్తించారు. ఈ కేసులలో శస్త్రచికిత్సకు ముందు కనిపించిన అత్యంత సాధారణ లక్షణాలలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, ముఖ నొప్పి, ముక్కు నుండి రక్తస్రావం ఉన్నాయి.

ఈ కేసు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది?

గతంలో ముక్కు, గడ్డం, దవడ ఎముకలోని ఖాళీ ప్రదేశం (మాక్సిల్లరీ సైనస్) కంటి సాకెట్ కింది భాగంలో దంతాలు అసాధారణ ప్రదేశాల్లో (ఎక్టోపిక్ టీత్) కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కంటి సాకెట్ పైభాగంలో అంటే కనురెప్పకు, కనుబొమ్మకు మధ్యలో దంతం కనిపించడం ప్రపంచంలోనే ఇదే మొదటి కేసు. మాకు తెలిసినంత వరకు కంటి సాకెట్ పైభాగంలో దంతం (ectopic tooth) ఏర్పడటం అనేది నమోదైన మొదటి కేసు అని దీని గురించి డాక్టర్ తన్వర్ ఇలా తెలిపారు. ఇది మాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికే ఒక ప్రత్యేకమైన కేసు. దీన్ని చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయామన్నారు. దంతాల అభివృద్ధి ప్రక్రియలో కలిగే అంతరాయాలు, జన్యుపరమైన కారణాలు, ఇన్ఫెక్షన్లు లేదా గాయాల వల్ల దంతాలు అసాధారణ స్థానాల్లో (ఎక్టోపిక్ టీత్) ఏర్పడవచ్చు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో దంతం ఇలా ఏర్పడటానికి గల ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 4:10 pm Digital Edition : Prabhanews
Viral News: 16ఏళ్ల బాలుడికి కంట్లో పెరిగిన దంతం.. వరల్డ్‌లో ఫస్ట్ కేసు మన దగ్గరే జరగడం విశేషం | ట్రెండింగ్

అసలు విషయం ఏమిటి..?మధురైలోని అరవింద్ కంటి ఆసుపత్రికి 16 ఏళ్ల బాలుడు చికిత్స కోసం వెళ్లాడు. గత నెల రోజులుగా అతని ఎడమ కనురెప్ప వాచి ఉంది. అయితే అతనికి ఎటువంటి నొప్పి లేదు. అలాగే గతంలో ఆ కంటి దగ్గర ఎటువంటి గాయం కూడా కాలేదు. వాపుకు గల కారణం తెలియకపోవడంతో అతను వైద్య పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే హాస్పిటల్‌కి వెళ్లినట్లుగా న్యూస్18 పంజాబ్ కథనంలో పేర్కొంది.నొప్పి లేదు గాయం కాలేదు..టీనేజ్ వయసులో ఉన్న బాలుడ్ని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించారు అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులు. కంటి వాపు ఉన్న ప్రాంతంలో గట్టిగా, తెల్లగా, బయటకు పొడుచుకు వచ్చినట్లున్న రెండు వస్తువులను గమనించారు. సీటీ (CT) స్కాన్‌లో కంటి కుహరం పైభాగం నుండి దంతం వంటి నిర్మాణం ఒకటి బయటకు వస్తున్నట్లు గుర్తించారు. ఇందులో దంతానికి ఉండే కిరీట భాగం (crown), వేరు (root) రెండూ ఉన్నాయి. దంతంలాంటి రెండు మొనదేలిన భాగాలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపించాయి.కుక్క పన్ను..హెల్త్ & మీ నివేదిక ప్రకారం ఈ ఉబ్బిన ప్రాంతాలు తాకినప్పుడు చాలా నునుపుగా, గట్టిగా ఉన్నాయని డాక్టర్ మేఘనా తన్వర్ తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆ వస్తువును తొలగించారు. పరీక్షలో అది పూర్తిగా పెరిగిన కోరపల్లు అని అంటే కుక్క పంటిని పోలిన పల్లు అని నిర్ధారణ అయింది. కణితికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదు. వైద్య పరిభాషలో దీనిని 'ఎక్టోపిక్ టూత్' (స్థానభ్రంశం చెందిన పంటి) అని అంటారు.ఎక్టోపిక్ టూత్ (ectopic tooth) అంటే ఏమిటి?ఎక్టోపిక్ టూత్ అంటే తన సహజ స్థానంలో కాకుండా వేరే చోట అభివృద్ధి చెందే లేదా బయటకు వచ్చే దంతం. కొన్ని దంతాలు నోటి లోపలే తప్పు స్థానాల్లో ఉండవచ్చు. మరికొన్ని శరీరంలోని పూర్తిగా భిన్నమైన భాగాలలో కూడా అభివృద్ధి చెందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.డాక్టర్లు చెప్పిన మాటలు..ఈ బాలుడి కేసు భిన్నమైనది. అతని పన్ను కంటికి పైన ఉన్న ప్రాంతంలో ఉంది. సాధారణంగా అక్కడ పన్ను ఉంటుందని ఎవరూ ఊహించలేరు. ప్రారంభంలో వైద్యులు ఇది 'టెరాటోమా' (teratoma) అనే ఒక రకమైన కణితి కావచ్చునని అనుమానించారు. ఇటువంటి కణితిలో ఎముక లేదా దంత కణజాలం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స ద్వారా తొలగించిన నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత అది కణితి కాదని పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక నిజమైన పన్నేనని స్పష్టమైంది.(ఎక్టోపిక్ టూత్ (ectopic tooth) అంటే తప్పు స్థానంలో మొలిచే లేదా అభివృద్ధి చెందే దంతం)కండీషన్‌ని బట్టి సర్జరీ..స్థానభ్రంశం చెందిన దంతాన్ని తీసివేయాలా వద్దా అనేది అది ఉన్న ప్రదేశం,అది ఏవైనా సమస్యలను కలిగిస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ దంతం విడిగా ఉండి, ఎటువంటి లక్షణాలను కలిగించకపోతే ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు దానిని కేవలం పర్యవేక్షిస్తారు. అయితే ఆ పంటి వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే ఒక మార్గానికి అడ్డుపడితే చుట్టుపక్కల నిర్మాణాలను దెబ్బతీస్తే, లేదా దానితో పాటు సిస్ట్ ఉంటే, అప్పుడు శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించడం అవసరం అవుతుంది. వైద్యులు ఒక దంతం ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవడానికి , దాని చుట్టూ ఉన్న నిర్మాణాలను గుర్తించడానికి స్కాన్‌లను ఉపయోగిస్తారు. CT స్కాన్ ద్వారా ఆ దంతం కళ్లు, నరాలు లేదా రక్తనాళాలకు ఎంత దగ్గరగా ఉందో తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగా శస్త్రచికిత్స చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.ముక్కులో వస్తే..ఒకవేళ దంతం ముక్కులో లేదా సైనస్‌లో ఉన్నట్లయితే వైద్యులు తరచుగా ఎండోస్కోప్‌ను ఉపయోగిస్తారు. ఇది కెమెరా శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను కలిగి ఉండే ఒక సన్నని గొట్టం. దీని సహాయంతో పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే ముక్కు మార్గం ద్వారా ఆ దంతాన్ని తొలగించవచ్చు. ఒక సమీక్షలో ఈ పద్ధతిని ఉపయోగించి ముక్కు లేదా సైనస్‌లలో ఉన్న అసాధారణ దంతాలను తొలగించిన 27 కేసులను గుర్తించారు. ఈ కేసులలో శస్త్రచికిత్సకు ముందు కనిపించిన అత్యంత సాధారణ లక్షణాలలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, ముఖ నొప్పి, ముక్కు నుండి రక్తస్రావం ఉన్నాయి.ఈ కేసు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది?గతంలో ముక్కు, గడ్డం, దవడ ఎముకలోని ఖాళీ ప్రదేశం (మాక్సిల్లరీ సైనస్) కంటి సాకెట్ కింది భాగంలో దంతాలు అసాధారణ ప్రదేశాల్లో (ఎక్టోపిక్ టీత్) కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కంటి సాకెట్ పైభాగంలో అంటే కనురెప్పకు, కనుబొమ్మకు మధ్యలో దంతం కనిపించడం ప్రపంచంలోనే ఇదే మొదటి కేసు. మాకు తెలిసినంత వరకు కంటి సాకెట్ పైభాగంలో దంతం (ectopic tooth) ఏర్పడటం అనేది నమోదైన మొదటి కేసు అని దీని గురించి డాక్టర్ తన్వర్ ఇలా తెలిపారు. ఇది మాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికే ఒక ప్రత్యేకమైన కేసు. దీన్ని చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయామన్నారు. దంతాల అభివృద్ధి ప్రక్రియలో కలిగే అంతరాయాలు, జన్యుపరమైన కారణాలు, ఇన్ఫెక్షన్లు లేదా గాయాల వల్ల దంతాలు అసాధారణ స్థానాల్లో (ఎక్టోపిక్ టీత్) ఏర్పడవచ్చు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో దంతం ఇలా ఏర్పడటానికి గల ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియదు.

Source link