ఇదిలా ఉండగా, తనిఖీల్లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో డీఎన్వీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లైసెన్స్‌ను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ సస్పెండ్ చేసింది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల నిల్వ, లైసెన్సింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఆ సంస్థ పాటించలేదని అధికారులు గుర్తించారు. అలాగే, ఆహార భద్రతా నియమాలు, నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు సంస్థ లైసెన్స్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)

