ప్రభన్యూస్

App: రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఈ గుంటూరు కుర్రాడు కనిపెట్టిన యాప్ వాడితే మీ లైఫ్ సెట్! | బిజినెస్


Last Updated:

డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టే యాప్.. గుంటూరు యువ ఇంజినీర్ అదిరిపోయే క్రియేషన్.

రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఈ గుంటూరు కుర్రాడు కనిపెట్టిన యాప్ వాడితే మీ లైఫ్ సెట్!
రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఈ గుంటూరు కుర్రాడు కనిపెట్టిన యాప్ వాడితే మీ లైఫ్ సెట్!

కేవలం ఐదు నిమిషాలే కదా అని టైమ్ పాస్ కోసం ఫోన్ చేతిలోకి తీసుకుంటాం.. కానీ సోషల్ మీడియాలోని కస్టమైజ్డ్ ఫీడ్ పుణ్యమా అని అందులో పూర్తిగా లీనమైపోయి 40 నిమిషాలు గడిచినా స్క్రీన్ మీద నుంచి కళ్లు తిప్పుకోలేం. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఈ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్. ఈ అనంతమైన డిజిటల్ మాయాజాలం నుంచి జనాన్ని బయటపడేయడానికి గుంటూరుకు చెందిన 31 ఏళ్ల యువ ఏఐ ఇంజినీర్ హర్ష ఓ పరిష్కారం కనుక్కున్నాడు. ఫోన్ వ్యసనానికి చెక్ పెట్టి మన సమయాన్ని మనకు ఆదా చేసేలా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన వినూత్న అప్లికేషనే ‘క్విట్ యాప్’.

ఈ యాప్ ప్రధాన ఉద్దేశం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే అలవాటుగా మారిన డిజిటల్ అడిక్షన్ లూప్‌ను బ్రేక్ చేయడమే. అత్యవసరమైన ఫోన్ కాల్స్, సాధారణ టెక్స్ట్ మెసేజ్ యాప్స్ మినహాయించి స్మార్ట్‌ఫోన్‌లోని మిగతా ఏ అప్లికేషన్‌కైనా మనం టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో ‘డిజిటల్ ఫ్రీ ఛాలెంజ్’, ‘ప్రియారిటీస్ రిమైండర్’ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు ‘నేను మూడు రోజుల పాటు ఇన్‌స్టాగ్రామ్ అసలు చూడను’ అని యాప్‌లో ఛాలెంజ్ సెట్ చేసుకుని అందులో విజయం సాధిస్తే.. వినియోగదారులకు స్కోర్, ఆకర్షణీయమైన రివార్డులు ఇస్తారు. తద్వారా ఫోన్ వాడకాన్ని తగ్గించుకునే క్రమశిక్షణను సరదాగా పెంపొందించవచ్చు.

ఇది కూడా చదవండి: ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్!

గుంటూరుకు చెందిన సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న హర్ష.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. బెంగళూరు మహా నగరంలోని శాంసంగ్ సహా పలు ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఏడేళ్ల పాటు ప్రతిష్టాత్మక ఉద్యోగం చేశాడు. సమాజానికి నేరుగా ఉపయోగపడే సాంకేతికతను తీసుకురావాలన్న బలమైన తపనతో గతేడాది డిసెంబర్‌లో కేవలం నలుగురు సభ్యుల బృందంతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించాడు. సుమారు పది లక్షల రూపాయల పెట్టుబడితో ఈ సరికొత్త ‘క్విట్ యాప్’ను అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు.

ఇది కూడా చదవండి: MP Midhun Reddy: టెన్షన్ టెన్షన్..  ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు, ఫోటోలు!

ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌కు స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 270 మంది యాక్టివ్ యూజర్లు ప్రతిరోజూ ఈ యాప్ వాడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గించడం కోసం హర్ష బృందం పలు చోట్ల అవగాహన వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. శ్రీరామ, వల్లభ, యశోద వంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ యాప్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. భవిష్యత్తులో విద్యాసంస్థలతో నేరుగా బీ టు బీ కొలాబరేషన్ కోసం సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి సారించేలా ఈ యాప్ ఒక గైడ్‌లా పనిచేస్తుంది.

ఈ విలువైన సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు సంస్థ చాలా అందుబాటు ధరల్లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు కేవలం రూ.199, మూడు నెలలకు రూ.499, ఏడాది మొత్తానికి రూ.999 చెల్లించి ఈ యాప్ సేవలు నిరంతరాయంగా పొందవచ్చు. ఆధునిక కాలంలో సెల్ ఫోన్ వాడకం పూర్తిగా మానెయ్యడం సాధ్యం కాకపోయినా.. అవసరమైనంత వరకే వాడుకుంటూ వ్యసనం బారిన పడకుండా ఉండేందుకు ఈ ‘క్విట్ యాప్’ ఎంతగానో దోహదపడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 4:14 pm Digital Edition : Prabhanews
App: రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఈ గుంటూరు కుర్రాడు కనిపెట్టిన యాప్ వాడితే మీ లైఫ్ సెట్! | బిజినెస్

Last Updated:Oct 16, 2026 3:55 PM ISTడిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టే యాప్.. గుంటూరు యువ ఇంజినీర్ అదిరిపోయే క్రియేషన్.రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఈ గుంటూరు కుర్రాడు కనిపెట్టిన యాప్ వాడితే మీ లైఫ్ సెట్!కేవలం ఐదు నిమిషాలే కదా అని టైమ్ పాస్ కోసం ఫోన్ చేతిలోకి తీసుకుంటాం.. కానీ సోషల్ మీడియాలోని కస్టమైజ్డ్ ఫీడ్ పుణ్యమా అని అందులో పూర్తిగా లీనమైపోయి 40 నిమిషాలు గడిచినా స్క్రీన్ మీద నుంచి కళ్లు తిప్పుకోలేం. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఈ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్. ఈ అనంతమైన డిజిటల్ మాయాజాలం నుంచి జనాన్ని బయటపడేయడానికి గుంటూరుకు చెందిన 31 ఏళ్ల యువ ఏఐ ఇంజినీర్ హర్ష ఓ పరిష్కారం కనుక్కున్నాడు. ఫోన్ వ్యసనానికి చెక్ పెట్టి మన సమయాన్ని మనకు ఆదా చేసేలా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన వినూత్న అప్లికేషనే 'క్విట్ యాప్'.ఈ యాప్ ప్రధాన ఉద్దేశం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే అలవాటుగా మారిన డిజిటల్ అడిక్షన్ లూప్‌ను బ్రేక్ చేయడమే. అత్యవసరమైన ఫోన్ కాల్స్, సాధారణ టెక్స్ట్ మెసేజ్ యాప్స్ మినహాయించి స్మార్ట్‌ఫోన్‌లోని మిగతా ఏ అప్లికేషన్‌కైనా మనం టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో 'డిజిటల్ ఫ్రీ ఛాలెంజ్', 'ప్రియారిటీస్ రిమైండర్' లాంటి అద్భుతమైన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు 'నేను మూడు రోజుల పాటు ఇన్‌స్టాగ్రామ్ అసలు చూడను' అని యాప్‌లో ఛాలెంజ్ సెట్ చేసుకుని అందులో విజయం సాధిస్తే.. వినియోగదారులకు స్కోర్, ఆకర్షణీయమైన రివార్డులు ఇస్తారు. తద్వారా ఫోన్ వాడకాన్ని తగ్గించుకునే క్రమశిక్షణను సరదాగా పెంపొందించవచ్చు.ఇది కూడా చదవండి: ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్!గుంటూరుకు చెందిన సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న హర్ష.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. బెంగళూరు మహా నగరంలోని శాంసంగ్ సహా పలు ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఏడేళ్ల పాటు ప్రతిష్టాత్మక ఉద్యోగం చేశాడు. సమాజానికి నేరుగా ఉపయోగపడే సాంకేతికతను తీసుకురావాలన్న బలమైన తపనతో గతేడాది డిసెంబర్‌లో కేవలం నలుగురు సభ్యుల బృందంతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించాడు. సుమారు పది లక్షల రూపాయల పెట్టుబడితో ఈ సరికొత్త 'క్విట్ యాప్'ను అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు.ఇది కూడా చదవండి: MP Midhun Reddy: టెన్షన్ టెన్షన్..  ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు, ఫోటోలు!ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌కు స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 270 మంది యాక్టివ్ యూజర్లు ప్రతిరోజూ ఈ యాప్ వాడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గించడం కోసం హర్ష బృందం పలు చోట్ల అవగాహన వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. శ్రీరామ, వల్లభ, యశోద వంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ యాప్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. భవిష్యత్తులో విద్యాసంస్థలతో నేరుగా బీ టు బీ కొలాబరేషన్ కోసం సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి సారించేలా ఈ యాప్ ఒక గైడ్‌లా పనిచేస్తుంది.ఈ విలువైన సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు సంస్థ చాలా అందుబాటు ధరల్లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు కేవలం రూ.199, మూడు నెలలకు రూ.499, ఏడాది మొత్తానికి రూ.999 చెల్లించి ఈ యాప్ సేవలు నిరంతరాయంగా పొందవచ్చు. ఆధునిక కాలంలో సెల్ ఫోన్ వాడకం పూర్తిగా మానెయ్యడం సాధ్యం కాకపోయినా.. అవసరమైనంత వరకే వాడుకుంటూ వ్యసనం బారిన పడకుండా ఉండేందుకు ఈ 'క్విట్ యాప్' ఎంతగానో దోహదపడుతుంది.మరింత చదవండి

Source link