ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్! |


Last Updated:

ప్రియుడి మోజులో నెత్తుటేరులు.. వణికించిన ‘రింగ్ రోడ్డు’ మర్డర్ కేసులో సంచలన నిర్ణయం!

ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్!
ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్!

ప్రియుడి మోజులో పడి కాబోయే భర్తను కిరాతకంగా మట్టుబెట్టిన ఓ కర్కశకారిణికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2003లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన బెంగళూరు ‘రింగ్‌ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడు అరుణ్‌ వర్మ బృందానికి జైలు శిక్ష కొనసాగాల్సిందేనని మంత్రివర్గం స్పష్టం చేసింది. నేరస్తులకు ఎలాంటి కనికరం చూపవద్దని, వారికి బయట తిరిగే అర్హత లేదని తీర్మానించింది. అమాయకుడి ప్రాణాలు తీసిన ఈ హంతకులకు జైలే సరైన శిక్ష అని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.

గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలకమైన క్షమాభిక్ష అంశంపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. కాబోయే భర్తను పథకం ప్రకారం అత్యంత క్రూరంగా హత్య చేయించిన శుభ, ఆమె ప్రియుడికి 2010లో రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేసి తమను విడుదల చేయాలని కోరుతూ వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. క్షమాభిక్ష తుది నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్‌ విచక్షణకు వదిలేస్తూ గతేడాది జులైలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలో గవర్నర్ తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కిరాతకులకు క్షమాభిక్షను కచ్చితంగా తిరస్కరించాలని గవర్నర్‌కు గట్టి సిఫార్సు చేస్తూ క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఇది కూడా చదవండి: Rayachoti Clashes: రణరంగాన్ని తలపిస్తున్న రాయలసీమ.. తొలిరోజే ఏపీలో ప్రత్యక్ష యుద్ధం!

అసలు ఈ కేసు ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బెంగళూరులో ఓ ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉన్నత స్థాయిలో పని చేస్తున్న గిరీష్‌తో.. న్యాయ విద్య ఐదో సెమిస్టర్ చదువుతున్న శుభకు 2003 డిసెంబరు 1న నిశ్చితార్థం జరిగింది. పెద్దలు ఎంతో ఇష్టపడి కుదిర్చిన ఈ పెళ్లి శుభకు ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికే కాలేజీలో తన సీనియరు అరుణ్‌ వర్మతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. తనకు ఇష్టం లేకుండా జరిగిన నిశ్చితార్థం విషయాన్ని వెంటనే తన ప్రియుడికి చెప్పిన శుభ.. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న గిరీష్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని ఓ పక్కా స్కెచ్ వేసింది.

ఇది కూడా చదవండి: Rain Forecast: 3 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ రోజు ఏ ఏ జిల్లాల్లో వానలు కుమ్మేస్తాయంటే.. వాతావరణ శాఖ హెచ్చరిక!

నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే శుభ తన నెత్తుటి ప్లాన్ అమలు చేసింది. కాబోయే భర్త గిరీష్‌ను ఎంతో ప్రేమగా నమ్మిస్తూ హోటల్‌లో భోజనానికి పిలిచింది. డిన్నర్ పూర్తయ్యాక హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం వద్ద ఆకాశంలో ఎగిరే విమానాలను చూద్దామని చెప్పి తన కారులో అక్కడికి తీసుకెళ్లింది. విమానాలు చూసే నెపంతో గిరీష్ కారు దిగిన వెంటనే అప్పటికే చీకట్లో మాటు వేసిన ప్రియుడు అరుణ్‌ వర్మ, అతడి స్నేహితులు ద్విచక్రవాహనం షాక్‌ అబ్సార్బర్‌తో గిరీశ్‌ తలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన గిరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు విడిచాడు.

ఈ సంచలన ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో శుభ అసలు నిజాలు అంగీకరించింది. తనకు ఏమాత్రం ఇష్టం లేని వివాహాన్ని తల్లిదండ్రులను ఎదిరించి ధైర్యంగా చెప్పలేకపోయానని విచారణలో వెల్లడించింది. అటు ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని వదులుకోలేక, ఇటు ఇంట్లో వాళ్లను కాదనలేక ఏ పాపం ఎరుగని గిరీష్‌ను అత్యంత దారుణంగా పొట్టనపెట్టుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురికి జీవిత ఖైదు పడగా.. తాజా మంత్రివర్గ కఠిన నిర్ణయంతో వీరికి ఎలాంటి క్షమాభిక్ష దక్కే అవకాశం లేకుండా పోయింది. చట్టం ముందు నేరస్తులు తప్పించుకోలేరని ఈ తీర్మానం మరోసారి నిరూపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 3:49 pm Digital Edition : Prabhanews
ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్! |

Last Updated:Oct 16, 2026 3:31 PM ISTప్రియుడి మోజులో నెత్తుటేరులు.. వణికించిన 'రింగ్ రోడ్డు' మర్డర్ కేసులో సంచలన నిర్ణయం!ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్!ప్రియుడి మోజులో పడి కాబోయే భర్తను కిరాతకంగా మట్టుబెట్టిన ఓ కర్కశకారిణికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2003లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన బెంగళూరు ‘రింగ్‌ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడు అరుణ్‌ వర్మ బృందానికి జైలు శిక్ష కొనసాగాల్సిందేనని మంత్రివర్గం స్పష్టం చేసింది. నేరస్తులకు ఎలాంటి కనికరం చూపవద్దని, వారికి బయట తిరిగే అర్హత లేదని తీర్మానించింది. అమాయకుడి ప్రాణాలు తీసిన ఈ హంతకులకు జైలే సరైన శిక్ష అని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలకమైన క్షమాభిక్ష అంశంపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. కాబోయే భర్తను పథకం ప్రకారం అత్యంత క్రూరంగా హత్య చేయించిన శుభ, ఆమె ప్రియుడికి 2010లో రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేసి తమను విడుదల చేయాలని కోరుతూ వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. క్షమాభిక్ష తుది నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్‌ విచక్షణకు వదిలేస్తూ గతేడాది జులైలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలో గవర్నర్ తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కిరాతకులకు క్షమాభిక్షను కచ్చితంగా తిరస్కరించాలని గవర్నర్‌కు గట్టి సిఫార్సు చేస్తూ క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.ఇది కూడా చదవండి: Rayachoti Clashes: రణరంగాన్ని తలపిస్తున్న రాయలసీమ.. తొలిరోజే ఏపీలో ప్రత్యక్ష యుద్ధం!అసలు ఈ కేసు ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బెంగళూరులో ఓ ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉన్నత స్థాయిలో పని చేస్తున్న గిరీష్‌తో.. న్యాయ విద్య ఐదో సెమిస్టర్ చదువుతున్న శుభకు 2003 డిసెంబరు 1న నిశ్చితార్థం జరిగింది. పెద్దలు ఎంతో ఇష్టపడి కుదిర్చిన ఈ పెళ్లి శుభకు ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికే కాలేజీలో తన సీనియరు అరుణ్‌ వర్మతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. తనకు ఇష్టం లేకుండా జరిగిన నిశ్చితార్థం విషయాన్ని వెంటనే తన ప్రియుడికి చెప్పిన శుభ.. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న గిరీష్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని ఓ పక్కా స్కెచ్ వేసింది.ఇది కూడా చదవండి: Rain Forecast: 3 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ రోజు ఏ ఏ జిల్లాల్లో వానలు కుమ్మేస్తాయంటే.. వాతావరణ శాఖ హెచ్చరిక!నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే శుభ తన నెత్తుటి ప్లాన్ అమలు చేసింది. కాబోయే భర్త గిరీష్‌ను ఎంతో ప్రేమగా నమ్మిస్తూ హోటల్‌లో భోజనానికి పిలిచింది. డిన్నర్ పూర్తయ్యాక హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం వద్ద ఆకాశంలో ఎగిరే విమానాలను చూద్దామని చెప్పి తన కారులో అక్కడికి తీసుకెళ్లింది. విమానాలు చూసే నెపంతో గిరీష్ కారు దిగిన వెంటనే అప్పటికే చీకట్లో మాటు వేసిన ప్రియుడు అరుణ్‌ వర్మ, అతడి స్నేహితులు ద్విచక్రవాహనం షాక్‌ అబ్సార్బర్‌తో గిరీశ్‌ తలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన గిరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు విడిచాడు.ఈ సంచలన ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో శుభ అసలు నిజాలు అంగీకరించింది. తనకు ఏమాత్రం ఇష్టం లేని వివాహాన్ని తల్లిదండ్రులను ఎదిరించి ధైర్యంగా చెప్పలేకపోయానని విచారణలో వెల్లడించింది. అటు ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని వదులుకోలేక, ఇటు ఇంట్లో వాళ్లను కాదనలేక ఏ పాపం ఎరుగని గిరీష్‌ను అత్యంత దారుణంగా పొట్టనపెట్టుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురికి జీవిత ఖైదు పడగా.. తాజా మంత్రివర్గ కఠిన నిర్ణయంతో వీరికి ఎలాంటి క్షమాభిక్ష దక్కే అవకాశం లేకుండా పోయింది. చట్టం ముందు నేరస్తులు తప్పించుకోలేరని ఈ తీర్మానం మరోసారి నిరూపించింది.మరింత చదవండి

Source link