ప్రపంచంలో ముడి చమురు కొరత ఏర్పడకపోయినా, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన వివాదం మరింత ముదరడంతో ఇప్పుడు దృష్టి చమురు ఉత్పత్తిపై కాకుండా, ముడి చమురును ఉపయోగించగల ఇంధనంగా మార్చే సామర్థ్యంపై పడింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, రిఫైనరీల సామర్థ్యం, ఇంధన రవాణా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాబోయే నెలల్లో రవాణా ఖర్చులు, ఇంధన ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీఎన్‌ఎన్ నివేదికను ప్రస్తావిస్తూ మనీకంట్రోల్ ప్రచురించిన కథనం ప్రకారం, ప్రస్తుతం ప్రధాన సమస్య తగినంత ముడి చమురు ఉందా లేదా అనేది కాదు. ఆ చమురును పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, హీటింగ్ ఆయిల్ వంటి ఉత్పత్తులుగా మార్చేందుకు తగినన్ని రిఫైనరీలు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నాయా అనేదే అసలు సమస్య. రిఫైనరీల మౌలిక సదుపాయాలపై దాడులు, నౌకా రవాణాలో అంతరాయాలు, ఇంధన సరఫరా తగ్గడం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లకు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

