ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిష్ బాంకర్ మాట్లాడుతూ, “ప్రతిభకు ఆడ, మగ అనే తేడా ఉండదని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మేం గట్టిగా నమ్ముతాం. మా పురుష అడ్వైజర్ల పనితీరు కూడా మెరుగుపడుతోంది. అదే సమయంలో, మహిళా అడ్వైజర్లు కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. 2026 సెప్టెంబర్ 30 నాటికి మా మొత్తం అడ్వైజర్లలో మహిళలు సుమారు 32 శాతం ఉన్నారు. అయితే, కంపెనీ ఏజెన్సీ వ్యాపారంలో వీరి వాటా దాదాపు 45 శాతంగా ఉంది. బెంగళూరు, కేరళ, ముంబై వంటి ప్రాంతాల్లో ఈ వాటా 50 శాతాన్ని కూడా దాటింది. మా మహిళా అడ్వైజర్లు వివిధ నేపథ్యాల నుంచి వచ్చారు. వీరిలో ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళలు, జీతం తీసుకుంటూ ఉద్యోగాలు చేసే వారు, వ్యాపారాలు నిర్వహించే మహిళలు ఉన్నారు. ఒక మేనేజర్‌లా ఒకేసారి పలు పనులు చేయడం, కన్సల్టెంట్‌లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, బ్యాంకర్‌లా డబ్బును నిర్వహించడం వంటి నైపుణ్యాలు వీరిలో సహజంగానే ఉంటాయి” అని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

