హైదరాబాద్లో జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ కీలక సందేశం ఇచ్చారు. సూపర్ ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ఆందోళనల నేపథ్యంలో నీరు, విద్యుత్, ఆహారాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరువు ముప్పుపై చేసిన హెచ్చరికను ప్రస్తావించిన విజయ్.. రాబోయే ఏడాది సహజ వనరులను బాధ్యతగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిటిష్ పాలన కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన తీవ్ర కరువును గుర్తుచేస్తూ, గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.
Source link
