Last Updated:
Air India Flight Emergency Landing: ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న గతంలో విస్తారా సేవగా ఉన్న ‘ఫ్లైట్ AI 2030’కి బాంబు ముప్పు ఉండవచ్చన్న సమాచారం అందడంతో జైపూర్‌కు మళ్లించబడింది. ప్రస్తుతం ఫ్లైట్‌లో పైలెట్, ప్యాసింజర్లను తనిఖీ చేస్తున్నారు.
Air India Flight Emergency Landing: ఫ్రాంక్ఫర్ట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2030 హైజాక్ ముప్పు ఉందనే అనుమానంతో భద్రతా హెచ్చరిక జారీ కావడంతో జైపూర్‌కు మళ్లించారు. ఆ విమానం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. భద్రతా తనిఖీల కోసం తరలించబడింది. ఈ హెచ్చరికపై దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం ఉదయం జైపూర్ ఎయిర్‌పోర్టులో దింపాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎయిర్ ఇండియా AI-2030 విమానం ప్రయాణిస్తుండగా విమానాన్ని ఎవరో అదుపులోకి తీసుకున్నట్లు లేదా హైజాక్ యత్నం జరుగుతున్నట్లు సూచించే అంతర్జాతీయ సంకేతం ‘స్క్వాక్ 7500’ (Squawk 7500) కోడ్‌ను పైలట్ కొన్ని సెకన్ల పాటు ప్రసారం చేసినట్లు సమాచారం. ఈ అలర్ట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి అందడంతో వెంటనే భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని జైపూర్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. భారీగా మోహరించిన భద్రతా దళాలువిమానం ల్యాండ్ అయిన వెంటనే ఉదయం 9:45 గంటల ప్రాంతంలో దాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకి తరలించారు. భద్రతా నిబంధనల ప్రకారం ఇద్దరు పైలట్లను విమానం నుంచి కిందకు దించి తనిఖీలు ప్రారంభించారు.
#WATCH | Rajasthan: An Air India flight AI2030 operating from Frankfurt to Delhi was diverted to Jaipur following a security alert over a suspected hijack threat. The aircraft landed safely at Jaipur International Airport and was moved for security checks. The alert remains under investigation.
Visuals from outside the airport.— ANI (@ANI) October 14, 2026
విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ, వారి లగేజీని భద్రతా సంస్థలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. అంతే కాదు వచ్చిన సమాచారం ప్రకారం ఉగ్రవాద నిరోధక దళం (ATS)తో పాటు ఇతర భద్రతా సంస్థల బృందాలు జైపూర్ విమానాశ్రయానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నాయి.
ఫ్లైట్ హైజాక్ అలర్ట్ హెచ్చరికలతో ఏ అత్యవసర పరిస్థిత్తినైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందాన్ని కూడా అప్రమత్తంగా (Standby) ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న అధికారులుఈ హైజాక్ అలర్ట్ పొరపాటున ప్రసారమైందా లేక దీని వెనుక ఏదైనా సాంకేతిక లోపం ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ కోసం న్యూస్18 తెలుగుని ఫాలో అవ్వండి.

