మౌలోని ప్రభుత్వ ఆయుర్వేద, యునానీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మోకాళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వయసు పెరగడం, అధిక బరువు, పోషకాలు, విటమిన్ల లోపం, మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడటం వంటివి ముఖ్యమైన కారణాలు. కొన్నిసార్లు కీళ్ల వ్యాధులు, గాయాల వల్ల కూడా నొప్పులు వస్తాయి. ఈ సమస్యల కారణంగా నడవడం, కూర్చోవడం, నిలబడటం వంటి సాధారణ పనులు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు.

