ప్రభన్యూస్

తెలుగు గంగ నీటి కోసం విజయ్ విజ్ఞప్తి.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

చెన్నైలో తాగునీటి అవసరాలు పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. ఏపీ సీఎం చంద్రబాబును కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరింత నీటిని విడుదల చేయాలని కోరారు.

News18
News18

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మధ్య కీలక భేటీ జరిగింది. విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవ్‌-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విజయ్.. మంగళవారం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో కలిసి ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చెన్నై తాగునీటి అవసరాలు, తెలుగు గంగ నీటి విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానం అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

చెన్నై తాగునీటి కోసం విజయ్ విజ్ఞప్తి

చెన్నై నగర ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరింత నీటిని విడుదల చేయాలని సీఎం విజయ్.. చంద్రబాబును కోరారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, కృష్ణా జలాల లభ్యత తగ్గడంతో నీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చెన్నైకి తాగునీరు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది చెన్నై నగరానికి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, రాష్ట్ర అవసరాలను పరిశీలించి అదనపు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని విజయ్‌కు హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 10 నుంచి నీటి సరఫరా నిలిపివేత

తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కండలేరు రిజర్వాయర్ నుంచి చెన్నైకి నీటిని సరఫరా చేస్తారు. అయితే, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని జలాశయాల నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. స్థానికంగా తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం గత సెప్టెంబర్ 10 నుంచి చెన్నైకి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అదనపు నీటి కోసం తమిళనాడు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.

గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ

సమావేశంలో దీర్ఘకాలిక నీటి సమస్యలకు పరిష్కారంగా నదుల అనుసంధానంపైనా చంద్రబాబు వివరించారు. గోదావరి-కావేరి నదులను అనుసంధానించడం ద్వారా కరువు సమస్యను తగ్గించవచ్చని, రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తే దక్షిణ భారతదేశంలో నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆయన గతంలోనూ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, విజయవాడ కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్‌లో జరిగిన విజయవాడ ఉత్సవ్‌-2.0లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, ఉత్సవ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రాశస్త్యాన్ని వివరించే పాటకు కూచిపూడి నృత్యాన్ని జోడించి కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 7:54 pm Digital Edition : Prabhanews
తెలుగు గంగ నీటి కోసం విజయ్ విజ్ఞప్తి.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Oct 13, 2026 7:50 PM ISTచెన్నైలో తాగునీటి అవసరాలు పెరగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. ఏపీ సీఎం చంద్రబాబును కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరింత నీటిని విడుదల చేయాలని కోరారు.News18ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మధ్య కీలక భేటీ జరిగింది. విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవ్‌-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విజయ్.. మంగళవారం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో కలిసి ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చెన్నై తాగునీటి అవసరాలు, తెలుగు గంగ నీటి విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానం అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.చెన్నై తాగునీటి కోసం విజయ్ విజ్ఞప్తిచెన్నై నగర ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరింత నీటిని విడుదల చేయాలని సీఎం విజయ్.. చంద్రబాబును కోరారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, కృష్ణా జలాల లభ్యత తగ్గడంతో నీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చెన్నైకి తాగునీరు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది చెన్నై నగరానికి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, రాష్ట్ర అవసరాలను పరిశీలించి అదనపు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని విజయ్‌కు హామీ ఇచ్చారు.సెప్టెంబర్ 10 నుంచి నీటి సరఫరా నిలిపివేతతెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కండలేరు రిజర్వాయర్ నుంచి చెన్నైకి నీటిని సరఫరా చేస్తారు. అయితే, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని జలాశయాల నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. స్థానికంగా తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం గత సెప్టెంబర్ 10 నుంచి చెన్నైకి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అదనపు నీటి కోసం తమిళనాడు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చసమావేశంలో దీర్ఘకాలిక నీటి సమస్యలకు పరిష్కారంగా నదుల అనుసంధానంపైనా చంద్రబాబు వివరించారు. గోదావరి-కావేరి నదులను అనుసంధానించడం ద్వారా కరువు సమస్యను తగ్గించవచ్చని, రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తే దక్షిణ భారతదేశంలో నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆయన గతంలోనూ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, విజయవాడ కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్‌లో జరిగిన విజయవాడ ఉత్సవ్‌-2.0లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, ఉత్సవ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రాశస్త్యాన్ని వివరించే పాటకు కూచిపూడి నృత్యాన్ని జోడించి కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.మరింత చదవండి

Source link