ప్రభన్యూస్

బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు!

ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 12:

కామారెడ్డి పట్టణంలో కలకలం రేపిన అనసూయ హత్య కేసులో మిస్టరీ వీడింది. బంగారు ఆభరణాలను దోచుకునే పథకంతో అనసూయను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బోసు రజిత (40), బోసు నర్సింగ్ (48) అనే భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. 2026 సెప్టెంబర్ 29న అనసూయ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన రజిత తన భర్త నర్సింగ్‌తో కలిసి అనసూయ ఇంట్లోకి ప్రవేశించారు. అనసూయ పూజ చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె ధరించిన బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. నేరంపై అనుమానం రాకుండా రజిత యథావిధిగా అనసూయ ఇంట్లో పనులకు వెళ్లి వచ్చినట్లు నటించినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, రజిత గతంలో కామారెడ్డిలోని భూమయ్య ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన సమయంలోనూ బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. 2023 సెప్టెంబరులో ఇంటి యజమాని బయటకు వెళ్లగా, ఆయన భార్య తన కుమార్తెను రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించేందుకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించి సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడు, 5 గ్రాముల బంగారు చెవి కమ్మలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుత హత్య కేసులో నిందితుల నుంచి బంగారు పుస్తెల తాడు (మంగళసూత్రం), రెండు బంగారు ఉంగరాలు, చెవి ఆభరణాలు కలిపి సుమారు 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, పోలీస్ కానిస్టేబుళ్లు రామస్వామి, రాజు నాయక్, సంపత్‌లను జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర అభినందించారు. కేసు దర్యాప్తులో వారి ప్రతిభ, అంకితభావాన్ని ప్రశంసించారు. హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు శాఖకు అనసూయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 2:45 pm Digital Edition : Prabhanews
<b>బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు!</b>