ప్రభన్యూస్

ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా? పోలీసు బలంతో ప్రజాస్వామ్య గొంతుకలను అణచలేరు!

ప్రభ న్యూస్ | విజయవాడ

ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడమేనా ప్రజాస్వామ్యం? ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి పక్షాన నిలబడి పోరాడే నాయకులను పోలీసుల ద్వారా అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తనను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును వినియోగించుకుంటూ ప్రజల పక్షాన ప్రశ్నించే నాయకులను పోలీసు బలగాలతో అడ్డుకోవడం నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకూడదా? ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులే సమాధానమా? అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల ద్వారా ప్రశ్నించే నాయకుల గొంతులను నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆంజనేయులు విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అడ్డుకుంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ దక్కుతుందని ప్రశ్నించారు.

అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాదు.. వారి సమస్యలకు సమాధానం చెప్పడం పాలకుల బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలి తప్ప, అరెస్టులతో భయపెట్టాలని చూడటం తగదని ఆంజనేయులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 6:56 pm Digital Edition : Prabhanews
<b>ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా? పోలీసు బలంతో ప్రజాస్వామ్య గొంతుకలను అణచలేరు!</b>