ప్రయాణానికి ముందు అనుకోని పరిస్థితులు ఎదురైతే, బుక్ చేసుకున్న రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేయాల్సి రావచ్చు. దీంతో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కన్ఫర్మ్ రైలు టికెట్‌పై ప్రయాణికుడి పేరును మార్చుకునేందుకు ఇండియన్ రైల్వేస్ అవకాశం కల్పిస్తోంది. దీనికి నిర్దిష్ట నిబంధనలు, గడువులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, విద్యార్థుల గ్రూపులు, పెళ్లి బృందాలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాడెట్లు, అధికారిక పనులపై ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించవచ్చు. అయితే, ఎవరికి పడితే వారికి టికెట్ బదిలీ చేయడం కుదరదు. అర్హతతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, నిర్ణీత సమయంలో దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

