ల్యాప్‌టాప్ ఉపయోగించే సమయంలో కీబోర్డ్‌పై Ctrl, Alt, Shift కీలతో పాటు Fn అనే కీని కూడా గమనించే ఉంటారు. అయితే ఈ కీ ఎందుకు ఉంటుంది? దీని ఉపయోగం ఏంటి? అనే విషయం చాలామందికి తెలియదు. నిజానికి, Fn కీ సహాయంతో స్క్రీన్ బ్రైట్నెస్ మార్చడం, సౌండ్ తగ్గించడం, పెంచడం, కీబోర్డ్ లైటింగ్‌ను నియంత్రించడం వంటి పనులు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లోని కొన్ని ఫీచర్లను వేగంగా ఉపయోగించుకోవడానికి ఈ కీ ఎంతో ఉపయోగపడుతుంది.

