Last Updated:
MCX: దేశీయ కమెడిటీ మార్కెట్‌లో గురువారం కూడా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. బుధవారంకు కొనసాగింపుగా గోల్డ్, సిల్వర్ ధరలు పడ్డాయి. గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ ఎంసీఎక్స్ (MCX) ధరల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో గురువారం బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలు, లాభాల స్వీకరణ (Profit Booking), డాలర్ సూచీ కదలికల ప్రభావంతో ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి ఫ్యూచర్స్‌పై అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ఆగస్టు 5 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.713 తగ్గి రూ.1,41,137కు చేరుకుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ 4 డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో కిలో వెండి ధర రూ.1,156 తగ్గి రూ.2,19,585 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు తాజా మార్కెట్ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Hyderabad,Telangana

