కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌తో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ జీఎల్‌సీ భారత్‌లోకి అడుగుపెడుతోంది. ఈ కారును కంపెనీ పుణెలోని చకన్‌లో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రంలో తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై భారత్‌లో తయారయ్యే తొలి మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ ఇదే. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని అందిస్తూనే, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలో ఇది కీలక ముందడుగు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన లగ్జరీ ఎస్‌యూవీల్లో ఒకటైన జీఎల్‌సీకి ఉన్న పేరును కొనసాగిస్తూ, కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను రూపొందించారు. మెర్సిడెస్ బెంజ్ కార్లలో ఉండే నాణ్యత, సౌకర్యం, హుందాతనంతో పాటు ఆధునిక ఎలక్ట్రిక్ డ్రైవ్ టెక్నాలజీ, స్మార్ట్ డిజిటల్ ఫీచర్లను ఇందులో అందించనున్నారు. (image: Mercedes-Benz)

