Last Updated:
Petrol Rate: మనకు జూన్ నెల బాగా ఇబ్బంది పెట్టింది. ఖర్చులు బాగా పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం అదనపు ఖర్చులు అయ్యాయి. జులై కూడా కొంపముంచే పరిస్థితి ఉంది. కారణం అమెరికా, ఇరాన్ దాడులే. కాబట్టి.. మనం ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు చూద్దాం.
హైదరాబాద్, విశాఖ, విజయవాడ.. ఏరియా ఏదైనా.. రోజూ ఆఫీసుకీ లేదా పనుల కోసం బైక్‌పై వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర నిలబడి ధర చూసి “ఇంకా పెరిగిందా?” అని ఆలోచిస్తుంటాం? జూన్ 28, 2026 నాటికి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ చమురు ధరలు కొన్ని రోజులుగా పడిపోయాయి. కానీ ఇండియాలో ధరలు తగ్గలేదు. ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంకా ఉందా లేదా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు (జూన్ 28, 2026):
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకి రూ.115.69 నుంచి రూ.115.73 ఉంది. డీజిల్ లీటర్ రూ.103.82గా స్థిరంగా ఉంది. కొన్ని రోజులుగా ఈ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఈ ధరలు తెలంగాణ స్టేట్ టాక్స్‌తో కలిపి ఉన్నాయి. అమీర్‌పేట, బేగంపేట బంకుల్లో కూడా ఇదే రేటు వస్తుంది. గత మే నెలలో రూ.3 వరకు ధర పెరిగాక.. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.
– బెంగళూరు: పెట్రోల్ లీటర్ సుమారు రూ.102.96 నుంచి రూ.111.68 దాకా ఉంది. డీజిల్ రూ.99.56 దాకా ఉంది. కర్ణాటకలో ధరలు హైదరాబాద్ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి.
– విజయవాడ: పెట్రోల్ లీటర్ రూ.117.73 ఉండగా.. డీజిల్ రూ.104.96 నుంచి రూ.105.45 ఉంది.
– విశాఖపట్నం: పెట్రోల్ లీటర్ రూ.117+ రేంజ్‌లో ఉండగాత.. డీజిల్ రూ.104.11 వరకు ఉంది. ఆంధ్రలో ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు.
దేశవ్యాప్తంగా ధరలు డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ ప్రకారం రోజూ ఉదయం 6 గంటలకు అప్‌డేట్ అవుతున్నాయి. IOCL, BPCL, HPCL వంటి కంపెనీలు ఈ ధరలను నిర్ణయిస్తున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కి ప్రస్తుతం $72-73 డాలర్లకి పడిపోయింది. ఇది ఇరాన్ యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో ఉన్న ధర స్థాయికి చేరింది. 2, 3 రోజులుగా కూడా క్షీణతే ఉంటోంది. హార్ముజ్ జలసంధిలో మళ్లీ నౌకలు తిరుగుతున్నాయి. అందువల్ల చమురు సప్లై పెరిగి.. ధర తగ్గుతోంది. WTI క్రూడ్ కూడా $69-70 స్థాయిలో ఉంది. యుద్ధం సమయంలో $120+ వరకు పెరిగిన ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి.
ఇరాన్ యుద్ధం & చమురు ధరలపై విశ్లేషణ:
ఇరాన్-ఇజ్రాయిల్-యూఎస్ యుద్ధం కారణంగా మార్చి-ఏప్రిల్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎగుమతులు తగ్గడం ప్రధాన కారణం. కానీ ఇప్పుడు ట్యాంకర్ ట్రాఫిక్ పునరుద్ధరణతో సప్లై మెరుగుపడింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే ధరలు పెరగవచ్చు. శాంతి చర్చలు ఫలిస్తే, ధరలు మరింత తగ్గవచ్చు. భారత్ వంటి దేశాలకు ఇది మంచి వార్త. మనం చమురు దిగుమతులపై ఆధారపడతాం కాబట్టి అంతర్జాతీయ ధరలు తగ్గితే రూపాయి బలం పెరిగి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana

