ప్రభన్యూస్

చిట్టీల పేరుతో నమ్మకం.. కోట్ల లావాదేవీలపై అనుమానాలు! బాధితులకు న్యాయం ఎప్పుడు ?

ప్రభ న్యూస్ , పుట్టపర్తి, శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో , అక్టోబర్ 5 :

చిట్టీల పేరుతో పరిచయం పెంచుకుని.. నమ్మకాన్ని సంపాదించి.. కొంతకాలం సక్రమంగా చిట్టీలు నిర్వహించిన అనంతరం పెద్ద మొత్తంలో నగదు సేకరించి చివరకు ఇంటికి తాళం వేసి దంపతులు కనిపించకుండా పోయారన్న ఆరోపణలు కదిరి పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. బాధితుల ఫిర్యాదులతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది. అయితే కోట్ల రూపాయల లావాదేవీలుగా ప్రచారం జరుగుతున్న ఈ వ్యవహారంలో అసలు వాస్తవం ఏమిటి? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి? బాధితుల సొమ్ము తిరిగి అందేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కదిరిలో నివాసం ఉంటున్న వీరారెడ్డి తనకల్లు మండల ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రాంజీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించినట్లు సమాచారం. ఉద్యోగరీత్యా ఏర్పడిన పరిచయాలతో పాటు కదిరి ప్రాంతంలో చాలాకాలంగా వడ్డీ వ్యాపారం, చిట్టీల నిర్వహణ చేస్తున్న వ్యక్తిగా ఆయనకు పరిచయం ఏర్పడినట్లు బాధితులు చెబుతున్నారు. చాలాకాలంగా చిట్టీలు నిర్వహించడంతో తొలినాళ్లలో చందాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, చిరు వ్యాపారులు తదితరులు ఆయన వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా చిట్టీలకు సంబంధించిన చెల్లింపుల్లో జాప్యం ప్రారంభమైనప్పటికీ, తమ డబ్బుకు ఎలాంటి ప్రమాదం ఉండదనే నమ్మకంతో పలువురు వేచి చూసినట్లు బాధితులు చెబుతున్నారు. చిట్టీ సొమ్ము ముందుగా తీసుకున్న వారికి చెల్లింపులు ఆలస్యం కావడం, ఒకరి చెల్లింపుల కోసం మరొకరి నుంచి వచ్చిన మొత్తాన్ని వినియోగించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ డబ్బు కోసం వీరారెడ్డిని సంప్రదించేందుకు బాధితులు ప్రయత్నించిన సమయంలో స్పందన లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించడంతో అనుమానాలు మరింత పెరిగాయి. వీరారెడ్డి, ఆయన భార్య కనిపించకుండా పోయారన్న సమాచారంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. చిట్టీల పేరుతో రూ.6 కోట్ల నుంచి రూ.11 కోట్ల వరకు వివిధ వ్యక్తుల నుంచి నగదు సేకరించి చెల్లింపులు చేయకుండా వెళ్లిపోయారన్న చర్చ పట్టణంలో జరుగుతోంది.

అయితే ఈ మొత్తానికి సంబంధించి అధికారికంగా ఎంత నగదు లావాదేవీలు జరిగాయన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో వీరారెడ్డితో పాటు మరికొందరి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. చిట్టీల నిర్వహణ, నగదు సేకరణ, లావాదేవీలు, చెల్లింపుల వివరాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధితులు అంటున్నారు. తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ బాధితులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించినట్లు సమాచారం. చిట్టీల పేరుతో తాము చెల్లించిన మొత్తాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో కదిరి సీఐ వెంకటేశ్వర్లు కేసు పూర్వాపరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి వివరాలు సేకరించడం, చిట్టీలకు సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించడం ద్వారా అసలు వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ, నమ్మకంతో చిట్టీల్లో డబ్బులు పెట్టే ప్రజలు మోసపోతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో అధికారులు ఎంత వేగంగా స్పందిస్తారు? బాధితుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది? అసలు బాధితుల సంఖ్య ఎంత? మొత్తం లావాదేవీలు ఎంత? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? పరారీలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులు ఎక్కడ ఉన్నారు? అన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. బాధితులు తమ జీవితకాల పొదుపులను నమ్మకంతో అప్పగించిన నేపథ్యంలో, వారి సొమ్ము తిరిగి అందేలా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 6:16 pm Digital Edition : Prabhanews
<b>చిట్టీల పేరుతో నమ్మకం.. కోట్ల లావాదేవీలపై అనుమానాలు! బాధితులకు న్యాయం ఎప్పుడు </b>?