సమస్యలు ముదిరితే ప్రజా ఉద్యమమే సమాధానం

సమస్యలు ముదిరితే ప్రజా ఉద్యమమే సమాధానం

జన్‌జీ ఆందోళనల నుంచి ప్రజా ఉద్యమం దిశగా అడుగులు.. పాలక విధానాలపై ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు

ఖమ్మం,ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో, సెప్టెంబర్ 28 :

దేశంలో సమస్యల స్వరూపం మారిపోయిందని, ఒకప్పుడు ఆకలి ప్రధాన సమస్యగా ఉండగా ప్రస్తుతం నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కార్పొరేటీకరణ తదితర అంశాలు భారతీయ సమాజాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని ఐఎఫ్‌టీయూ జాతీయ నేత పి. ప్రసాద్ అన్నారు. పాలక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొని దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను వివరించడంతో పాటు జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు మోటివేటర్‌గా వ్యవహరించగా, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నామ పురుషోత్తం సభకు అధ్యక్షత వహించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి కె. రాంనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని ప్రసాద్ ఆరోపిస్తూ, దానికి వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఉత్పత్తి కారకాలైన రైతులు, కార్మికులు ఇప్పటికే ఆందోళనల బాట పట్టారని, రైతాంగం చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామిక శక్తులు కూడా సమీప భవిష్యత్తులో ఆందోళనలకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గత కొంతకాలంగా నేటి తరం తరగతి గదులు, కార్యాలయాలకే పరిమితమవుతోందని, సామాజిక స్పృహ లేని తరంగా ముద్ర పడుతున్న సమయంలో జన్‌జీ ఉద్యమం యువతతో పాటు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోందని తెలిపారు. ఇది ప్రస్తుత రాజకీయాల్లో కీలక మలుపు అని, కేవలం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంతోనే జన్‌జీ ఉద్యమం ఏర్పడలేదని, దాని వెనుక సామాజిక అంశాలు కూడా ఉన్నాయని అన్నారు. పెరిగిన నిరుద్యోగం, గాడితప్పిన ఆర్థిక పరిస్థితులు, కార్పొరేటీకరణ వంటి అంశాలు జన్‌జీపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. జన్‌జీ ఉద్యమాన్ని స్వాగతిస్తున్నామని, వామపక్ష శక్తులు సమన్వయంతో పనిచేసి పాలక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశంలోనూ 48 గంటల తర్వాత ఆందోళనకు పూనుకుంటామని జన్‌జీ ప్రకటించిందని, ఇలాంటి ఆందోళనలు విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష సిద్ధాంతం బలమైనదని, దానికి మరో ప్రత్యామ్నాయం లేదని ప్రసాద్ అన్నారు. ఉద్యమాల చీలికలు ఏవైనా వాటి బలాన్ని తగ్గిస్తాయని పేర్కొంటూ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, అది సాధ్యం కాని పక్షంలో ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. దేశంలో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ వినియోగం తగ్గడం అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. అమెరికా వంటి దేశాలు తమ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపిస్తూ, రానున్న కాలంలో ఈ దిగుమతుల ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలపై కూడా తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశం ఇప్పటికే ఉన్నప్పటికీ పూర్తి స్థాయి కార్పొరేటీకరణ ఇంకా జరగలేదని, భవిష్యత్తులో ఆ ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక వృద్ధి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని, అది కేవలం అంకెల గారడీ మాత్రమేనని ప్రసాద్ విమర్శించారు. సంపద కలిగిన వారు మరింత సంపన్నులవుతుండగా, పేదలు మరింత పేదలవుతున్నారని అన్నారు. ప్రజలను భౌతికంగా పోరాటాలకు సిద్ధం చేయకుండా చేపట్టే ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదని పేర్కొన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వారిని ఉద్యమాలకు సిద్ధం చేసేందుకు వామపక్షాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. గతంలో పెట్టుబడిదారుల మధ్య పోటీ పరిమితంగా ఉండేదని, ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గాల మధ్య కూడా పోటీ పెరిగిందని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం యువతలో ఉన్న ఆలోచనా విధానానికి, గత కొన్ని నెలలుగా యువతలో కనిపిస్తున్న ఆలోచనా మార్పుకు స్పష్టమైన తేడా ఉందని, ఉదాసీన వైఖరి నుంచి ప్రశ్నించే తత్వం వైపు యువత అడుగులు వేస్తోందని ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మార్పును అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక శక్తులు స్వాగతించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 11:44 am Digital Edition : Prabhanews
<b>సమస్యలు ముదిరితే ప్రజా ఉద్యమమే సమాధానం</b>