ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం HSBC 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన బంగారం ధరల అంచనాలను సవరించింది. 2026 సగటు ధర అంచనాను 4,864 డాలర్ల నుంచి 4,560 డాలర్లకు తగ్గించింది. 2027 అంచనాను 5,000 డాలర్ల నుంచి 4,925 డాలర్లకు సవరించింది. 2026 మిగిలిన కాలంలో బంగారం ధరలు 3,800 నుంచి 4,700 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏడాది చివరికి ధరలు సుమారు 4,750 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేసింది.

