ప్రభన్యూస్

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్‌కు చారిత్రక పతకం.. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం! |


Last Updated:

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ జోడీ మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి భారత్‌కు ప్రతిష్టాత్మక కాంస్య పతకాన్ని అందించింది.

News18
News18

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్లు మానుష్ షా, దియా చితాలే చారిత్రక విజయం సాధించారు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఈ జోడీ కాంస్య పతకాన్ని ముద్దాడి దేశానికి గర్వకారణంగా నిలిచింది. సెమీఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంక్ జంట, చైనాకు చెందిన వాంగ్ చుకిన్, సన్ యింగ్షా చేతిలో 0-4 తేడాతో భారత జంట ఓటమి పాలైంది. పటిష్టమైన చైనా ఆటగాళ్ల ధాటికి తట్టుకోలేక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ, సెమీస్ చేరిన మానుష్, దియా జోడీకి కాంస్య పతకం దక్కింది.

ఈ పతకంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఇరవైకి చేరుకుంది. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో పతకం కాగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కేవలం రెండో పతకం కావడం విశేషం.

అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ అయిన మానుష్, దియా సంచలన ప్రదర్శన చేశారు. ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట, హాంకాంగ్‌కు చెందిన వోంగ్ చున్ టింగ్, డూ హోయ్ కెమ్‌లను 3-1 (11-6, 13-15, 11-9, 11-5) తేడాతో చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలైన హాంకాంగ్ ఆటగాళ్లపై భారత యువ జంట పూర్తి ఆధిపత్యం చెలాయించి పతకాన్ని ఖాయం చేసింది.

ఆసియా క్రీడల చరిత్రలో ఇంతకుముందు 2018 జకార్తా క్రీడల్లో ఆచంట శరత్ కమల్, మనికా బత్రా జోడీ తొలిసారి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సాధించింది. అదే ఏడాది పురుషుల జట్టు కాంస్యం గెలవగా, 2023 హాంగ్జౌ క్రీడల్లో సుతీర్థ ముఖర్జీ, ఐహికా ముఖర్జీ మహిళల డబుల్స్‌లో కాంస్యం అందించారు. ఇప్పుడు మానుష్ షా, దియా చితాలే ఆ ఘనతను కొనసాగిస్తూ వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు టేబుల్ టెన్నిస్ పతకాన్ని అందించి కొత్త చరిత్ర లిఖించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 4:39 pm Digital Edition : Prabhanews
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్‌కు చారిత్రక పతకం.. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం! |

Last Updated:Sep 25, 2026 4:36 PM ISTజపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ జోడీ మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి భారత్‌కు ప్రతిష్టాత్మక కాంస్య పతకాన్ని అందించింది.News18జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్లు మానుష్ షా, దియా చితాలే చారిత్రక విజయం సాధించారు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఈ జోడీ కాంస్య పతకాన్ని ముద్దాడి దేశానికి గర్వకారణంగా నిలిచింది. సెమీఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంక్ జంట, చైనాకు చెందిన వాంగ్ చుకిన్, సన్ యింగ్షా చేతిలో 0-4 తేడాతో భారత జంట ఓటమి పాలైంది. పటిష్టమైన చైనా ఆటగాళ్ల ధాటికి తట్టుకోలేక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ, సెమీస్ చేరిన మానుష్, దియా జోడీకి కాంస్య పతకం దక్కింది.ఈ పతకంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఇరవైకి చేరుకుంది. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో పతకం కాగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కేవలం రెండో పతకం కావడం విశేషం.అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ అయిన మానుష్, దియా సంచలన ప్రదర్శన చేశారు. ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట, హాంకాంగ్‌కు చెందిన వోంగ్ చున్ టింగ్, డూ హోయ్ కెమ్‌లను 3-1 (11-6, 13-15, 11-9, 11-5) తేడాతో చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలైన హాంకాంగ్ ఆటగాళ్లపై భారత యువ జంట పూర్తి ఆధిపత్యం చెలాయించి పతకాన్ని ఖాయం చేసింది.ఆసియా క్రీడల చరిత్రలో ఇంతకుముందు 2018 జకార్తా క్రీడల్లో ఆచంట శరత్ కమల్, మనికా బత్రా జోడీ తొలిసారి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సాధించింది. అదే ఏడాది పురుషుల జట్టు కాంస్యం గెలవగా, 2023 హాంగ్జౌ క్రీడల్లో సుతీర్థ ముఖర్జీ, ఐహికా ముఖర్జీ మహిళల డబుల్స్‌లో కాంస్యం అందించారు. ఇప్పుడు మానుష్ షా, దియా చితాలే ఆ ఘనతను కొనసాగిస్తూ వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు టేబుల్ టెన్నిస్ పతకాన్ని అందించి కొత్త చరిత్ర లిఖించారు.మరింత చదవండి

Source link