ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఉడ్తా తీర్’. ఆకాష్ ఎ. కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ మూవీలో ఆయుష్మాన్ పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ బిలాల్‌గా కనిపిస్తాడు. భారత్‌కు రహస్య మిషన్‌పై వచ్చిన అతను ప్రమాదంలో జ్ఞాపకశక్తిని కోల్పోయి, తాను ఇండియన్ CTS ఆఫీసర్ అని భావిస్తాడు. పాకిస్థాన్ పంపిన గూఢచారి భారత్‌కు అనుకూలంగా మారడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. సారా అలీ ఖాన్ పవర్ఫుల్ CTS ఆఫీసర్‌గా నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Source link
పాకిస్థాన్ పంపిన గూఢచారి.. భారత్‌కు దేశభక్తుడిగా మారితే?.. హిలేరియస్‌గా 'ఉడ్తా తీర్' మూవీ ట్రైలర్!
