టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ‘నేచురల్ స్టార్’గా ఎదిగిన హీరో నాని. పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో యూత్‌లో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విశేషమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నాని అసలు పేరు నవీన్ బాబు. ఇండస్ట్రీకి రాకముందు రేడియో జాకీగా (RJ) కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాపు, శ్రీను వైట్ల వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

