ఇదిలా ఉండగా, మరో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లో నవా షెవా పోర్టులో రూ.3 కోట్ల విలువైన 10,000 కిలోల బాణాసంచాను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అక్రమ రవాణా ముఠాకు చెందిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దిగుమతి సరుకులో ప్రకటించిన బాటిళ్ల సరుకు వెనుక బాణసంచాను దాచిపెట్టారు. సరుకును పూర్తిగా తనిఖీ చేయడంతో 19,800 బాణసంచా ముక్కలు బయటపడ్డాయి. వీటిని ‘288 గ్యాట్లింగ్’గా పిలుస్తారు. మొత్తం బరువు సుమారు 10,000 కిలోలు కాగా, మార్కెట్ విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

