న్యూస్18 బెంగాలీ కథనం ప్రకారం, మోషన్ సిక్నెస్కు ప్రధాన కారణం కళ్లకు, మన శరీరంలోని సమతుల్యతను నియంత్రించే అంతర్గత చెవికి మధ్య వచ్చే తేడా. ఉదాహరణకు, మీరు కారు లేదా బస్సులో కూర్చున్నప్పుడు కళ్లకు మీరు ఒకే చోట కూర్చున్నట్లు కనిపిస్తుంది. కానీ లోపలి చెవిలోని సమతుల్యత వ్యవస్థ మాత్రం శరీరం కదులుతోందని మెదడుకు సంకేతాలు పంపుతుంది. కళ్ల నుంచి వచ్చే ‘స్థిరంగా ఉన్నాం’ అనే సంకేతం, చెవి నుంచి వచ్చే ‘కదులుతున్నాం’ అనే సంకేతం వేర్వేరుగా ఉండటంతో మెదడులో గందరగోళం ఏర్పడుతుంది. దాంతో తల తిరగడం, వికారం, ఆందోళన, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.

