యాపిల్ ఇందులో సిరామిక్ షీల్డ్ 2ను కూడా తీసుకొచ్చింది. ఇది స్క్రాచ్‌లకు 3 రెట్లు మెరుగైన రక్షణ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. గ్లేర్ కూడా తగ్గుతుంది. ఐఫోన్ 17 ఐదు రంగుల్లో లభిస్తుంది. బ్లాక్, లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్ కలర్స్‌లో కొనొచ్చు. ఐఫోన్ 17కు యాపిల్ ఏ19 చిప్ పవర్ ఇస్తుంది. ఇది 3ఎన్ఎం టెక్నాలజీపై రూపొందించారు. ఈ చిప్ సీపీయూ, జీపీయూ పనితీరులో గణనీయమైన మెరుగుదలలు తీసుకొస్తుంది. డివైస్‌లోనే ఏఐ ఫీచర్లను ఉపయోగించేందుకు న్యూరల్ యాక్సిలరేటర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఐఓఎస్ 26పై పనిచేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లలో లైవ్ ట్రాన్స్‌లేషన్, మెరుగైన విజువల్ ఇంటెలిజెన్స్, కాల్స్, మెసేజ్‌ల స్క్రీనింగ్‌తో పాటు కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ఉన్నాయి. (image: Apple India)

