Last Updated:
PM Awas Yojana 2026: తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 2 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.
PM Awas Yojana 2026: తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 2 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ కొత్తగా మంజూరు చేసిన ఇళ్లను గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం చేసుకునే ఒక్కొక్క లబ్దిదారుడికి కేంద్రం రూ. 72 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. గత తొమ్మిదేళ్లుగా రూరల్ కోటా కింద మంజూరు కావాల్సిన ఈ ఇళ్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధించుకుంది.
తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత ఇల్లు నిర్మించుకునే వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఆర్ధిక సహాయం చేయనుంది. ఇందుకుగాను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ. 72 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత రూరల్ కోటా కింద ఈ ఇళ్లు మంజూరు కావడం విశేషం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిలిచిపోయిన ఈ ఇళ్ల మంజూరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. దాని ఫలితంగా శుక్రవారం హైదరాబాద్‌కి వచ్చిన కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 లక్షల ఇళ్ల మంజూరు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పర్యటనలో భాగంగానే మాదాపూర్ లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిశారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ) పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతి పత్రం అందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని కోరడంతో ఇప్పటికి మంజూరు చేసింది కేంద్రం. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి పరిస్థితుల్ని వివరించారు రేవంత్ రెడ్డి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. ఎల్నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని శివరాజ్ సింగ్ చౌహాన్‌కి తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కేంద్రమంత్రి కోరారు సీఎం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్న విషయాన్ని శుక్రవారం కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

