Last Updated:
గూగుల్ డీప్‌మైండ్ మాజీ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్, ఆంథ్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఉందని హెచ్చరించారు.
ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికే ముప్పు రావచ్చన్న హెచ్చరికలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్‌లో పనిచేసిన మరో మాజీ పరిశోధకుడు కూడా ఏఐ “మానవులందరినీ అంతం చేసే” స్థాయికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మనకు సమయం తగ్గిపోతోందని ఆయన అన్నారు. ఏఐ వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై ఆందోళన ఇటీవల మరింత పెరిగింది. ఆంథ్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ గత వారం తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఏఐని తయారు చేస్తున్నవాళ్లలో కొందరు ఈ టెక్నాలజీ వల్ల ఈ దశాబ్దం ముగిసేలోపే మనుషులందరూ చనిపోయే అవకాశం ఉందని నిజంగానే నమ్ముతున్నారని ఆయన అన్నారు. ఈ కారణాల్లో అది కూడా ఒకటని చెప్పారు. కాక్సన్ వ్యాఖ్యలపై ఆంథ్రోపిక్ శాస్త్రవేత్త ఇవాన్ హ్యూబింగర్ స్పందించారు. కాక్సన్ చెప్పింది సరైనదేనని ఆయన అన్నారు. వచ్చే పదేళ్లలో ఏఐ వల్ల మానవులందరూ అంతమయ్యే అవకాశం 10 శాతానికి మించి ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

