Last Updated:
Hyderabad: హైదరాబాద్ మరోసారి గ్లోబల్ కంపెనీలకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. FICCI–అనరాక్ నివేదిక ప్రకారం 2026 మార్చి నాటికి నగరంలో 515 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలు) ఉండగా, 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 50–70 GCCలు వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ మరింత పెరగనుంది.
హైదరాబాద్ నగరం మరోసారి గ్లోబల్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కీలక కేంద్రంగా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో పాటు ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కార్యాలయ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం హైదరాబాద్‌కు ప్రధాన బలంగా మారుతోంది. ఫలితంగా విదేశీ కంపెనీలు తమ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, అనలిటిక్స్, పరిశోధన వంటి కార్యకలాపాల కోసం నగరాన్ని ఎంచుకుంటున్నాయి.

