Last Updated:
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు రూపొందించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. 10 గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలకు ఆయన ఒక సరికొత్త రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సు ఒక చారిత్రక మైలురాయి అని, బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇది సరికొత్త బాధ్యతలకు నాంది పలుకుతుందని మోదీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకోవడంలో గ్లోబల్ సౌత్ ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై గ్లోబల్ సౌత్ కేవలం ఇతరుల నిబంధనలు పాటించే స్థాయి నుంచి, నిబంధనలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

